
Movie Name | శంఖం | |||
Banner | శ్రీ బాలాజీ సినీమీడియా పతాకం | |||
Producer | జె.భగవాన్, జె.పుల్లారావు | |||
Director | శివ | |||
Music | తమన్ | |||
Photography | వెట్రి | |||
Story | శివ | |||
Dialouge | అనిల్ రావిపుడి | |||
Lyrics | ||||
Editing | గౌతంరాజు | |||
Art | వివెక్ | |||
Choreography | ||||
Action | విజయ్, సెల్వ, గణేష్, రామ్-లక్ష్మణ్ | |||
Star Cast | గోపీచంద్, త్రిష, సత్యరాజ్, చంద్రమోహన్ కోటశ్రీనివాసరావు, ఆలీ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, రఘుబాబు, తెలంగాణ శకుంతల, కృష్ణభగవాన్, శ్రీనివాసరెడ్డి, ఎల్.బి. శ్రీరాం, బెనర్జీ, కాట్రాజు, ప్రసాద్ బాబు, ఫిష్ వెంకట్, పృద్వీ, సీత, రజిత, రాధాకుమారి తదితరులు.. |
చందు (గోపీచంద్) ఆస్ట్రేలియాలోని సిడ్నీలో తన బ్యాచిలర్ మేనమామ కృష్ణారావు (చంద్రమోహన్)తో కలిసి ఉంటాడు. చందు తండ్రి శివయ్య (సత్యరాజ్) ఉన్నా కూడా చందుకి తన తండ్రి చనిపోయాడని చెబుతాడు కృష్ణారావు. కొట్టుకోవడమంటే చందుకి మహా ఇష్టం కానీ ఛాన్స్ దొరకదు. ఒకసందర్భంలో మహాలక్ష్మి (త్రిష) ఓ వ్యక్తిని చితక్కొట్టడం చూసిన చందు ఆమె ప్రేమలో పడతాడు. ఆమె తన చిన్నాన్న బుచ్చయ్య (ధర్మవరపు సుబ్రహ్మణ్యం) దగ్గర ఉంటుంది. మహాలక్ష్మిని ప్రేమలో పడేయడానికి మహాలక్ష్మి ఫ్రెండ్ పెళ్లిని వేదికగా చేసుకోవాలనుకుంటాడు చందు. దానికి గాను పెళ్లి కొడుకు సైఫ్అలీఖాన్ (ఆలీ)ని తన ప్రాణస్నేహితుడిగా మలుచుకుంటాడు. చివరికి ఆమెని తన ప్రేమలో పడేసే సమయానికి మహాలక్ష్మి మేనత్త (తెలంగాణ శకుంతల) ఎంటరవుతుంది.. తన కొడుకు ప్రేమ్ (వేణుమాధవ్)తో ఆమె పెళ్లి చేయడానికి మహాలక్ష్మిని ఇండియాకి తీసుకువస్తుంది.
అది తెలిసిన చందు కూడా ఇండియాకి వస్తాడు. సీన్ రాయలసీమ ప్రాంతానికి మారుతుంది. మహాలక్ష్మి నాన్న పశుపతి (కోట శ్రీనివాసరావు)కి, శివయ్యకి ఏళ్ళ తరబడి శతృత్వం ఉంటుంది.. తన కూతురు ప్రేమిస్తున్న చందు శివయ్య కొడుకని, శివయ్యే తన తండ్రని చందుకి తెలియదని తెలుసుకున్న పశుపతి చందుని పావుగా వాడుకుని శివయ్యని చంపాలనుకుంటాడు. అయితే శివయ్య తన తండ్రని చందుకి తెలుస్తుంది.. అప్పటి నుండి శివయ్యతో కలిసి ఉన్న చందు పశుపతి కూతురిని ఎలా దక్కించుకున్నాడు, శివయ్య, పశుపతి మధ్యలో ఉన్న శతృత్వానికి ఎవరు బలయ్యారు, అసలు చందు తన తండ్రి శివయ్యకి దూరంగా ఎందుకున్నాడన్నది తెలియాలంటే సినిమా చూడాలి.


ఈ చిత్రానికి గోపీచంద్, త్రిషల నటన హైలెట్‌గా నిలుస్తుంది. అలాగే సైఫ్ అలీఖాన్ పాత్రలో ఆలీ తన సత్తా చాటాడు. ఆలీ ఉన్నంత సేపు థియేటర్ నవ్వులతో నిండిపోయింది. ఇక శివయ్య పాత్రలో నటించిన సత్యరాజ్ తన పాత్రని చక్కగా పోషించాడు. ప్రేమ్ పాత్రలో కనిపించిన వేణుమాధవ్ ఓవరాక్షన్ విసిగిస్తుంది. మిగిలిన వారంతా తమ నటనకి న్యాయం చేకూర్చారు.
ఈ చిత్రానికి సంగీత యావరేజ్‌గా ఉంది.
అనిల్ రావిపుడి వ్రాసిన మాటలు ప్రత్యేకంగా ఏమీ లేవు.
చిత్రానికి వెట్రి ఛాయాగ్రహణం ప్లస్ పాయింట్. ఆస్ట్రేలియాలోని సీన్స్, సుమో ఛేజింగ్ సీన్స్‌లో చాయాగ్రహణం పనితీరు ఆకట్టుకుంటుంది.. అలాగే సాంగ్స్ చిత్రీకరణ కూడా చాలా రిచ్‌గా ఉంది.
ఈ చిత్రానికి కథ, స్ర్కీన్ప్లే, దర్శకత్వం అందిచిన శివ ఈ మూడు డిపార్ట్మెంట్లలోనూ మరింత కసరత్తు చేయాల్సింది.

గోపి చంద్ మరియు త్రిష ఎ సినిమా కి పాజిటివ్ .ఇంక ఈ సినిమా లో పాజిటివ్ పాయింట్స్ ఎం లేవు
.

గతంలో ఈ తరహా సినిమాలు ఎన్నో వచ్చాయి కాబట్టి ఈ చిత్రం స్పెషల్గా అనిపించదు.. కామన్గానే సుమో ఛేజింగులు కూడా ఈ చిత్రంలో ఉన్నాయి. అయితే కథ, కథనంలో అనేక పొరపాట్లు దొర్లాయి.. పశుపతి తమ్ముడు శివయ్యకి భయపడి ఇరవై అయిదు సంవత్సరాలు ఎందుకు దాక్కుంటాడో అర్థం కాదు. అంతేకాదు తన తండ్రి శివయ్యే అని చందు దగ్గర దాయడం కూడా ఎందుకో తెలియదు. పోనీ ఫ్లాష్ బ్యాక్‌లో ఏదో స్పెషల్ ట్విస్టు ఏమన్నా ఉందా అంటే అదీ లేదు. సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి తరువాత సీన్లో స్టోరీ ఏంటో ఇట్టే అర్థమయి పోయే విధంగా స్ర్కీన్ప్లే సాగిపోవడం ఈ చిత్రానికి పెద్ద మైనస్.
సినిమాని ఏదో విధంగా లాక్కొచ్చి క్లైమాక్స్ని ఎలా తీయాలో అర్థం కాక దర్శకుడు ఏదో ఒకటి తీసాడనిపిస్తుంది ఈ చిత్రం క్లైమాక్స్ చూస్తుంటే. కేవలం క్లైమాక్స్ కోసమే శివయ్య క్యారెక్టర్ని చంపేసాడనిపిస్తుంది.. ఓవరాల్‌గా ఫ్యాక్షన్ కథతో సూపర్ డూపర్ హిట్ కొట్టాలనుకున్న దర్శకుడు కథ, కథాగమనాన్ని సరైన పంథాలో నడిపించక అయోమయ పద్దతిలో తీసేసాడు.


ఈ సినిమా చూడాల్సినడి ఎం కాదు ..వదిలేయండి.ఇంత కంటే ఈ సినిమా ఫై కామెంట్ చేయటం అనవసరం
NOTE:: THE OPINIONS MENTONED IN THIS BLOG ARE OF MINE.PLEASE SEND UR QUERIES TO AVIN009@GMAIL.COM OR CONTACT ME IMMEDIATELY IF ANY THING PRINTED WRONG IN MY REVIEW @ 9848117007.CALL US B/W 10:00 AM TO 3:00 PM ONLY
REVIEW BY avinash
UPDATED FROM tenali big cinemas