///ఫస్ట్ ఆన్ నెట్ ///
in one line::
ఎ మాయ చేసాడో కానీ సినిమా మాత్రం పిచ్చ పిచ్చ గా నచ్చింది
మొత్తం మీద నాగ చైతన్య గ్రహించాడు తనకి మాస్ సినిమా లు సరిపోవని మంచి లవ్ స్టొరీ తో మన ముందుకి vachadu బట్ మరి ముద్దులు ఎక్కువ పెతేసుకున్నాడు కొంచెం తగిస్తే బాగుండేదేమో చైతన్య!!!
కార్తీక్ (నాగచైతన్య) సినిమా డైరెక్టర్ కావాలనుకునే ఇంజనీరింగ్ విద్యార్థి. అతను ఉండే ఇంటి ఓనర్ కూతురైన జెస్సీ(సమంత)తో ప్రేమలో పడతాడు. జెస్సీకి కార్తీక్ కంటే రెండేళ్ళ వయస్సు ఎక్కువ. పైగా కార్తీక్ హిందూ, జెస్సీ క్రిస్టియన్. తామిద్దరికీ ఎక్కడా పొంతన లేదని తెలిసినా కార్తీక్ జెస్సీ వెంటపడతాడు. జెస్సీ ఎన్నోసార్లు కార్తీక్ కి తామిద్దరం ప్రేమించుకోవడం కుదరదు అని చెప్పినా కార్తీక్ వినిపించుకోడు.
కార్తీక్ జెస్సీ వెంట పడటం జెస్సీ తండ్రికి తెలిసిపోవడంతో జెస్సీకి వెంటనే పెళ్ళి కుదురుస్తాడు. కేరళలోని తమ స్వగ్రామంలో ఓ చర్చిలో పెళ్ళి ఏర్పాట్లు చేస్తాడు. కార్తీక్ తన ఫ్రెండ్ కృష్ణ (కృష్ణుడు)ని తీసుకుని జెస్సీవాళ్ళ వూరికి వెళతాడు. ఐతే జెస్సీ చర్చిలో చివరి నిమిషంలో ఈ పెళ్ళి తనకి ఇష్టం లేదని చర్చి నుండి బైటకి వచ్చేస్తుంది. తాను కార్తీక్ ని ప్రేమిస్తున్నానని తెలుసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది మిగతా కథ.
దర్శకుడు గౌతమ్ మీనన్ కథని డీల్ చేసే విధానం బావుంది. ప్రతి ఫ్రేమ్ ని చాలా చక్కగా తెరకెక్కించాడు. ఐతే సెకండ్ ఆఫ్ లో హీరోయిన జెస్సీ కార్తీక్ ని వదిలి విదేశాలకు ఎందుకు వెళ్ళిందో అర్థం కాదు. ఇకపోతే ఈ చిత్రంలో దర్శకుడు పూరిజగన్నాధ్ తన రియల్ క్యారెక్టర్ లోనే కన్పించి అందర్నీ ఆశ్చర్యపరుస్తాడు. వినాయకుడు ఫేమ్ కృష్ణుడు కూడా తన రియల్ లైఫ్ పాత్రలో కార్తీక్ ఫ్రెండ్ లా కనిపించడం ద్వారా సినిమా చూసే ప్రేక్షకులను కథలో ఇట్టే లీనమై పోయే విధంగా చేయడం దర్శకుడు గౌతమ్ మీనన్ ప్రతిభ. అలాగే కార్తీక్ తండ్రిగా ఈ సినిమా నిర్మాత సంజయ్ స్వరూప్ నటించి మెప్పించారు. ఈ చిత్రంలో మరో ప్రధాన ఆకర్షణ తమిళ హీరో శింబు , త్రిష అతిథి పాత్రలో కనిపించడం కొసమెరుపు.
నటన::
నాగచైతన్య :- నాగచైతన్య ఈ చిత్రంలో చాలా చక్కగా నటించాడు. ఎక్స్ ప్రెషన్ విషయంలోనూ, డైలాగ్ డెలివరీలోనూ డాన్స్ ల్లోనూ ఓవరాల్ గా నాగచైతన్య నటన ఆకట్టుకుంటుంది. తన తండ్రి అక్కినేని నాగార్జున స్టైల్ లోనే నాగచైతన్య కూడా వైవిధ్య భరితమైన పాత్రలను ఎంచుకోవడం విశేషం.
సమంత :- జెస్సీ పాత్రలో సమంత చాలా బావుంది. ఆమెలో కమిలిని ముఖర్జీ పోలికలు ఉండటం యాదృచ్ఛికమే అయినా నటనలో మాత్రం చాలా మంచి మార్కులే కొట్టేసింది.
కృ-ష్ణుడు :- వినాయకుడు చిత్రంలో హీరోగా నటించిన కృష్ణుడు కార్తీక్ ఫ్రెండ్ గా చాలా చక్కని నటన కనబరిచాడు. ముఖ్యంగా కేరళలో కార్తీక్, కృష్ణల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.
సంజయ్ స్వరూప్ :- ఈ చిత్ర నిర్మాత సంజయ్ స్వరూప్ కార్తీక్ తండ్రిగా చాలా బాగా చేశాడు.
సురేఖావాణి :- కార్తీక్ తల్లిగా సురేఖావాణి నటన ఆకట్టుకుంటుంది.
మిగతా నటీనటులు కూడా తమ పాత్రకు తగ్గట్టుగా నటించారు.
టెక్నికల్ డిపార్ట్ మెంట్.. ::
సంగీతం :- ఆస్కార్ అవార్డు గ్రహీత ఎ.ఆర్. రెహమాన్ అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ప్రేమకథలకు ఏ విధంగా సంగీతాన్ని అందించాలో ఎ.ఆర్. రెహమాన్ కి తెలిసినంతగా మరెవరికీ తెలియదేమో. ఆయన స్వరపరచిన పాటలు యూత్ ని విశేషంగా ఆకట్టుకుంటాయి.
కెమెరా :- ఈ చిత్రానికి మరో ప్లస్ పాయింట్ కెమెరా వర్క్. ప్రేక్షకుడు కథలో లీనమయ్యే విధంగా సన్నివేశాలను చిత్రీకరించే విధంగా కెమేరా పనితనం ఉంది. ప్రతి ఫ్రేమ్ కూడా ఎంతో అందంగా చాలా చక్కగా చిత్రీకరించారు.
మాటలు :- ఈ చిత్రంలో సంభాషణలు కూడా చాలా బావున్నాయి. ముఖ్యంగా హీరోయిన్ హీరోతో "పర్లేదు మా నాన్న అడిగితే తమ్ముడులాంటివాడు" అని అనడం అలాగే హీరోతో కృష్ణుడు "అరె మామ సారీ చెప్పడానికి వస్తే లంచ్ కి పిలుస్తారేమిట్రా" అన్న మాటలు అలాగే హీరో హీరోయిన్ తో "22 సంవత్సరాలనుండి నేనున్న ఊరిలో ఇప్పుడు ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను" అనడం అలాగే హీరోతో కృ-ష్ణుడు "కలర్ కలర్ లుంగీలు వేసుకొచ్చి పిచ్చకొట్టుడు కొడతార్రా" అన్న డైలాగ్ లు థియేటర్ లో ప్రేక్షకుల్నివిశేషంగా ఆకట్టుకున్నాయి.
దర్శకత్వం :- చక్కని ప్రేమకథను అందించడంలో గౌతమ్ మీనన్ ప్రతిభ ఎలాంటిదో ఆయన గత చిత్రాలను చూస్తేనే అర్థమైపోతుంది. అందుకు తగ్గట్టుగానే ఈ చిత్రాన్ని కూడా చక్కటి ప్రేమకథా చిత్రంగా రూపొందించాడు.
final point::
ఒకమంచి ఫీల్ గుడ్ ప్రేమకథా చిత్రాన్ని చూడాలనుకుంటే ఈ చిత్రాన్ని చూడండి.
just read::
మీకు ఒకటి చెప్పాన ఈ సినిమా లో నాగ చైతన్య మరియు సుమంత రెండు,మూడు సార్లు మూవీ ధియేటర్ కి వెళ్తారు అది చెన్నై లోని సత్యం సినిమాస్,అదే ధియేటర్ లో అదే సీట్స్ లో కూర్చొని నేను మా ఫ్రెండ్స్ అవతార్ మూవీ చూసాం అంటే నమ్ముతార ? నిజం అన్దీ బాబు !!!!
exclusively updated first on net from vijayawada