cast n crew::
Movie Name | సాధ్యం | |||
Banner | కెబిసి ప్రొడక్షన్స్ | |||
Producer | కుమార్ బ్రదర్స్ | |||
Director | కార్తికేయ గోపాలకృష్ణ | |||
Music | చిన్ని చరణ్ | |||
Photography | మరో ఫళిని | |||
Story | శ్యామ్ | |||
Dialouge | మధు | |||
Lyrics | ||||
Editing | గౌతంరాజు | |||
Art | ||||
Choreography | ||||
Action | ||||
Star Cast | జగపతిబాబు, ప్రియమణి, కీర్తీచావ్లా, తనికెళ్ళభరణి, కోట శ్రీనివాసరావు, ప్రగతి, జాకీ తదితరులు. |
సుహాని (ప్రియమణి) చాలా భయస్తురాలు. తన చుట్టూ ఉండే ప్రతి వారూ తన జీవితాన్ని ఏదో విధంగా డిస్టర్బ్ చేస్తున్నారన్న ఫీలింగ్ తో ఉంటుంది. ఓ రోజు రాత్రి వేళలో అనుకోకుండా కృష్ణప్రసాద్ (తనికెళ్ళభరణి) అనే వ్యక్తిని యాక్సిడెంట్ బారి నుండి కాపాడుతుంది. ప్రతి ఒక్కరిపైనా ఏదో తెలియని కోపంతో సుహాని రగిలిపోతుందని తెలుసుకున్న కృష్ణప్రసాద్ తన లైసెన్స్ డ్ రివాల్వర్ ని ఆమెకిస్తాడు. ఆమెని బాగా ఇబ్బందికి గురిచేసిన వారిని కాల్చిపారేయమని ఆమెకి చెబుతాడు. దానికి అంగీకరించిన సుహాని తన జీవితాన్ని బాగా డిస్టర్బ్ చేసిన తన క్లోజ్ ఫ్రెండ్ అనిత (కీర్తీచావ్లా), తన బాయ్ ఫ్రెండ్ సందీప్ (జగపతిబాబు)లని చంపాలనుకుంటుంది. ఆ తర్వాతేం జరిగిందన్నది మిగతా కథ.
analysis
ఒక పాయింట్ అనుకున్న తర్వాత ఆ పాయింట్ చుట్టూ బలమయిన సన్నివేశాలని అల్లుకోవడానికి స్టోరీ డిపార్ట్ మెంట్ ఎంతో కృషి చేయాల్సి ఉంటుంది. కానీ ఈ చిత్రంలో ఆ 'కృషి' అన్నది లోపించడంతో సన్నివేశాలు పేలవంగా మారిపోయాయి. జగపతిబాబు లాంటి మాస్ హీరో ఉన్నా కూడా ఆయనకి తగ్గట్టుగా పాత్రని క్రియేట్ చేయడంలో విఫలమయ్యారనే చెప్పాలి. కథ చెప్పే విధానంలో కూడా చాలా వరకు కన్ ఫ్యూజన్ కి గురయ్యారనిపిస్తుంది.
performance
నటన :-
జగపతిబాబు, ప్రియమణి తమ తమ పాత్రలలో బాగా నటించారు. హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో నటించిన కీర్తీచావ్లా కాస్త అతిగా నటించిందనిపిస్తుంది. మిగతా నటీ నటులు తమ పాత్రకి తగ్గట్టుగా నటించారు.
టెక్నికల్ డిపార్ట్ మెంట్ :
సంగీతం సోసోగానే ఉన్నా కూడా ఫస్ట్ సాంగ్ 'అయ్యోరామా'తో పాటు మరో రెండు పాటలు బావున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకునే విధంగా లేదనే చెప్పాలి.
కెమేరా :- ఫర్వాలేదు.
మాటలు :- మధు అందించిన మాటలు పెద్దగా ఆకట్టుకోవు ఓ సీన్ లో ప్రియమణితో తనికెళ్ళభరణి ''కాల్చి పారేయడానికి అందులో ఉన్నవి సిగరెట్స్ కావు బుల్లెట్లు'' లాంటి డైలాగులు ఫర్వాలేదనిపిస్తాయి.
"పెళ్లైన కొత్తలో", "ప్రవరాఖ్యుడు" తర్వాత జగపతిబాబు, ప్రియమణి కాంబినేషన్ ల హ్యాట్రిక్ చిత్రంగా వచ్చిన ఈ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోతుందేమో.