http://inoxmovies.com/images/raavan_hp.jpg
updates from london premiere,

RATING :: 3.5/5
USER RATIMG : 2.75/5
SEND UR RATINGS TO 9848117007
MOVIE NAMERATING


cast N crew

Banner
:
Madras Talkies
Producer : Manirathnam, Sharada Trilok
Director : Manirathnam
Music : A R Rahaman
Story : Manirathnam
Choreography : Ganesh, Acharya, Brinda, Shobhana, Ustad Debu
Lyrics : Late Veturi Sundara Ramamurthy
Dialouge : Ramakrishna
Action : Shyam Kaushal, Peter Heins
Star Cast :

Vikram, Aishwarya Rai, Abhishek Bacchan, Priyamani, Prithvi and others.



story::

వీరయ్య (విక్రమ్) అత్యంత మొండివాడు. తన వారికి తానే చట్టం, తానే న్యాయం, తానే ధర్మం. పోలీసులంటే భయం, చట్టం అంటే గౌరవం అతనికి లేవు. అతని చెల్లి (ప్రియమణి) కి నచ్చిన వాడితో పెళ్ళి జరిపే సమయంలో, అతని మీద యస్.పి. (పృధ్విరాజ్) కాల్పులు జరిపగా, గాయపడ్డ వీరయ్య తప్పించుకుంటాడు. వీరయ్య కోసం అతని చెల్లిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆమెను గ్యాంగ్ రేప్ చేస్తారు. ఆ బాధతో ఆమె ఆత్మహత్య చేసుకుంటుంది. దాంతో కోపంతో రగిలిన వీరయ్య ఆ పోలీసులందర్నీ రకరకాలుగా చంపేస్తాడు. ఆ యస్.పి. (పృధ్విరాజ్) భార్యను కిడ్నాప్ చేస్తాడు. యస్.పి.కి అతని మనసు తెలుసుకున్న భార్య రాగిణి (ఐశ్వర్యా రాయ్) ఉంటుంది. రాగిణి చాలా చక్కని శాస్త్రీయ నృత్య కళాకారిణి, ఆమెకు సంగీతం మీద కూడా మంచి పట్టుంది. వీరయ్య పోలీస్ ఆఫీసర్ మీద యుద్ధం మొదలు పెడతాడు. అప్పటి నుండి ఆ పోలీస్ ఆఫీసర్ కీ, వీరయ్యకీ మధ్య జరిగే యుద్ధంలో రాగిణి తన ప్రమేయం లేకుండా పావుగా మారుతుంది. ఆ తర్వాత మనం ఊహించని అనేక సంఘటనలు జరుగుతాయి. చివరికి ఏం జరిగిందనేది మిగిలిన కథ
http://icdn1.indiaglitz.com/telugu/gallery/Movies/villain_10/raavanan140510_4.jpg

prospective:
నటన -:
వీరయ్యగా నటించిన విక్రమ్, గతంలో జాతీయ ఉత్తమనటుడిగా రెండు సార్లు అవార్డు సంపాదించిన వాడు. విపరీతమైన ఆకలితో ఉన్నవాడికి సరైన, సంపూర్ణమైన ఆహారం లభిస్తే ఏ రేంజ్ లో భుజిస్తాడో, ఈ చిత్రంలో విక్రమ్ నటన అలా ఉంది. అతనికి ఈ చిత్రంలోని వీరయ్య పాత్ర మరోసారి జాతీయ అవార్డు తెచ్చిపెడుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు. అతని పాత్రలో అన్ని వేరియేషన్స్‌ వున్నాయి. ఇక మాజీ విశ్వసుందరి ఐశ్వర్యా రాయ్ జాతీయ స్థాయి సినిమాల్లోనే కాక అంతర్జాతీయ స్థాయి సినిమాల్లో కూడా నటించిన అనుభవశాలి. రాగిణిగా ఆమె తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ఆమెను ఎలా చూపిస్తే సగటు ప్రేక్షకుడి నుండి అత్యున్నత స్థాయి ప్రేక్షకుడి వరకూ సంతోషపడతారో మణిరత్నంకు బాగా తెలుసు. ఈ సినిమా కోసం ఈ మాజీ ప్రపంచ సుందరి ఎన్నడూ పడని కష్టాలు పడిందని చెప్పవచ్చు. ఇక ప్రియమణి విషయానికి వస్తే... ఈమె కూడా జాతీయ ఉత్తమనటిగా అవార్డు సంపాదించిన నటే. తన పాత్ర నిడివి కొద్ది సేపే అయినా ఉన్నంతలో ఆమె బాగా నటించింది. ఇక సింగన్నగా ప్రభు, ఫారెస్టు గార్డుగా కార్తీక్ మురళి బాగానే నటించారు.
సంగీతం -: మన దేశానికి రెండు ఆస్కార్ అవార్డులనందించిన ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఎ.ఆర్.రెహమాన్ ని సంగీత దర్శకుడిగా "రోజా" చిత్రంతో సినీ రంగానికి పరిచయం చేసింది మణిరత్నమే కనుక తన గురువు సినిమాకు తన శక్తి కొద్దీ చక్కని సంగీతం అందించాడనే చెప్పొచ్చు. పాటల్లో "ఉసురే పోయెనే", "కుళ్ళబొడిచేయ్" అనే పాటలు జనానికి బాగా ఆకట్టుకుంటాయి. ఇక రీ-రికార్డింగ్ ఈ చిత్రానికి ప్రాణం పోసిందని చెప్పాలి.
కెమెరా -: సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రాన్ని సెల్యులాయిడ్ దృశ్యకావ్యంగా మలచటానికి ఇతోధికంగా దోహదపడింది. ఈ సినిమాలోని ప్రతి ఫ్రేం ఒక పెయింటింగ్ లా మనకు కనపడుతుంది. వండర్ ఫుల్ ఫొటోగ్రఫీ. ఈ చిత్రంలో ఈ డిపార్ట్ మెంట్ అద్భుతంగా పనిచేసిందని చెప్పాలి.
ఎడిటింగ్ -: చాలా బాగుంది.
పాటలు -: దర్శక, నిర్మాత మణిరత్నంతో స్వర్గీయ వేటూరి సుందరరామ్మూర్తి గారి అనుబంధం 22 యేళ్ళ క్రితం వచ్చిన "గీతాంజలి" చిత్రం నుంచీ కొనసాగుతూ ఈ "విలన్" చిత్రం తో ముగిసింది. ఈ చిత్రానికి పేరు కూడా ఆయనే పెట్టారు. కానీ ఈ చిత్రంలోని పాటలు డబ్బింగ్ చిత్రంలోని పాటల్లాగా ఉండటం బాధాకరం.
మాటలు -: ఈ చిత్రం తమిళ వెర్షన్ కి శ్రీమతి సుహాసిని మణిరత్నం వ్రాయగా, తెలుగులో వచ్చిన "విలన్" చిత్రానికి రామకృష్ణ మాటలు వ్రాశారు. ఆయన మాటలు కొన్ని చోట్ల బాగున్నా అంతగా ఆకట్టుకోవు. పాటల్లాగానే ఈ చిత్రంలోని మాటలు కూడా డబ్బింగ్ చిత్రంలోని మాటల్లాగే ఉన్నాయి.
కొరియోగ్రఫీ -: నలుగురు ప్రఖ్యాత కొరియోగ్రాఫర్లు గణేష్ ఆచార్య, బృంద, శోభన, అస్తాద్ దేబూ ఈ చిత్రానికి కొరియోగ్రాఫర్లుగా పనిచేశారు. "కుళ్ళుపుడితే కుళ్ళబొడిచేయ్..." పాటకు మాత్రం కొరియోగ్రఫీ అదిరింది. మిగిలిన పాటలు కూడా ఫరవాలేదు.
కాస్ట్యూమ్స్ -: సబ్యసాచి సాయి డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ సహజంగా, చాలా కొత్తగా సన్నివేశాలకు తగ్గట్టుగా, నటీనటులకు సరిపోయే విధంగా ఉంటూ, ఆ సీన్ మూడ్ ని ప్రతబింబించే విధంగా ఉన్నాయి.
యాక్షన్ -: శ్యామ్ కౌశల్, పీటర్ హెయిన్ ఇద్దరూ ఈ చిత్రానికి యాక్షన్ కొరియోగ్రాఫర్లుగా పనిచేశారు. "మగధీర" చిత్రంతో పీటర్ హేయిన్స్ గురించి మన తెలుగు ప్రేక్షకులకు తెలిసిందే. శ్యామ్ కౌశల్ కూడా తక్కువ వాడేం కాదు. బాలీవుడ్ లో మంచి పేరున్నయాక్షన్ కొరియోగ్రాఫర్. మరి ఇలాంటి ఇద్దరు ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ల కలయికతో వచ్చిన ఈ చిత్రంలోని యాక్షన్ సీన్లు ప్రేక్షకులను అలరిస్తాయి.
http://icdn1.indiaglitz.com/telugu/gallery/Movies/villain_10/raavanan270410_3.jpg
lastly::
అద్బుతమైన సాంకేతిక బలంతో తీసిన ఈ చిత్రం మాస్‌ ప్రేక్షకులను ఎంతవరకు అలరిస్తుందో చెప్పటం కష్టం. మణిరత్నం దర్శకత్వం గురించి, విక్రమ్‌, ఐశ్వర్యరాయ్‌ నటనకోసం ఈ సినిమా చూడవచ్చు.

updates::

Updated at 11:40 AM

Film takes a new twist.

at 11:35 AM

Interesting fight scenes and bg song.

at 11:25 AM

Bridge fight interesting. Leading to the climax.

11:05 AM

Twist in the tale. Some movement in story.

at 10:58 AM

Another song follows.

at 10:55 AM

Priyamani enters. 5th song.

Updated at 10:52 AM

2nd half starts with another song.

:35 AM

Overall the first half lacks any punch except for vikram’s histrionics. Visuals and music. Dialogues are a letdown.

at 10:30 AM

Few interesting scenes & intermission now.

at 10:25 AM

3rd song now.

at 10:15 AM

Reminders of Apocalypse Now Redux. Pradhu Ranjitha too make their presence felt. Not a single frame with out Rahman’s and santosh Sivan’s effect

at 10:00 AM

2nd song with a mix of good and bad stunt work.

at 09:50 AM

1st song done in a decent credit scene.

09:45 AM

Vikram’s dubbing great. Good to see karthik of gharshana fame

09:35 AM

Action drama, Credits for 2 Cinematographers. Should be a treat for eyes.

at 09:30 AM

Movie starts now with great visuals of veera- music.



Raavan premiere
Raavan premiere
Raavan premiere
Raavan premiere