wx8afnl.jpg
http://sphotos.ak.fbcdn.net/hphotos-ak-snc4/hs013.snc4/34035_130865590281211_116194468414990_195666_5303491_n.jpg
live and exclusive from AGS గోల్డ్ CINEMAS CHENNAI

సెంటర్ లో ఎలా ?
A -CNTER : super hit

B-CENTER :hit

C -CENTER: hit
ఒక లైన్ లో సూటిగా చెప్పాలంటే :: కుటుంబ సమేతంగా చూడవలసిన మంచి సినిమా
rating :: 4/5




Story::

కథ రాయల సీమలో ఓ 28 యేళ్ళ క్రితం మొదలవుతుంది.బావ బావమరుదుల గొడవలో బావమరిదిని చంపిన బావ ఇంటికి వచ్చి తాను కూడా చనిపోతాడు.దాంతో అతని భార్య అక్కణ్ణించి హైదరాబాద్ కి తన బిడ్డతో సహా వచ్చేస్తుంది.ఆ బిడ్డే రాము (సునీల్).తన తమ్ముణ్ణి చంపిన వాడి వంశాన్ని నాశనం చేయాలని తన కొడుకులు మళ్ళసూరి(సుప్రీత్),బైరెడ్డి(ప్రభాకర్)ల చేత ఆన తీసుకుంటాడు రామినీడు (నాగినీడు).ఆ తర్వాత ప్రముఖ హీరో రవితేజ సైకిల్ కి ఇచ్చిన వాయిస్ ఓవర్ తో హైదరాబాద్ లో రాము జీవితం చూపిస్తారు.అంతా ఆటోల మీద సరుకు తీసుకెళుతుంటే సైకిల్ మీద సరుకు తీసుకెళ్ళే రాముని ఉద్యోగంలోంచి తీసేస్తాడు యజమాని. ఆ ఉద్యోగం పోవటంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నరాముకి ఒక కొరియర్ వస్తుంది.ఆ కొరియర్ లో కోర్టు కేసులో ఉన్న రాము తల్లికి చెందిన అయిదు ఎకరాల పొలం తిరిగి వారికే వచ్చిందన్నది సారాశం.ఆ పొలాన్ని అమ్మేసి ఒక ఆటో కొనుక్కుని తిరిగి తన పని తాను చేసుకోవాలని రాము రాయలసీమకు బయలుదేరతాడు.తాను వెళ్ళే రైల్లో అపర్ణ (సలోని)అనే అమ్మాయి కలుస్తుంది.ఆమె రామినీడు కూతురు.అపర్ణకీ,ఆమె బావ శ్రీకాంత్ (బ్రహ్మాజీ)కీ వివాహం చేయాలని పెద్దల నిర్ణయం.తీరా రాము రామినీడుని కలిసి, అతనింటికి వెళ్ళాక రామూకి ఒక భయంకరమైన నిజం తెలుస్తుంది.అదెంటంటే రామూ ఎక్కడ కనపడితే అక్కడ చంపాలన్నంత పగ రామినీడు కుటుంబానికుందని.అయితే వాళ్ళకి ఒక సాంప్రదాయం ఉంది.ఎంత పగవాడైనా ఇంటికొచ్చిన అతిథిని ఇంట్లో చంపరు.ఇల్లు దాటిని మరుక్షణం చంపేస్తారు.అందుకని రామూని ఇంటి బయటకు పంపటానికి రామినీడు అతని కొడుకులు,ఇంటి బయటకు వెళ్ళకుండా ఉండేందుకు రామూ ప్రయత్నిస్తూ ఉంటారు.ఆ గొడవ ఏమయిందన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలి...

Analysis::

అసలీ కథకున్న స్పాన్ చాలా తక్కువ.హీరో ఆ ఇంటిలో ఉన్నంత సేపే తను బ్రతుకుతాడు .ఆ ఇంటి బయటకు వచ్చిన వెంటనే చనిపోతాడు.ఈ ఒక్క పాయింట్ ని ఎంతసేపు సాగతీయగలం.అసలు ఇలాంటి కథని ఎన్నుకోవటం ఒక విధంగా సాహసమే.అయినా ఈ కథని అనవసర విషయాలతో నింపకుండ జాగ్రత్తగా హ్యాండిల్ చేశాడని చెప్పాలి.అందుకు చక్కని స్క్రీన్ ప్లే కారణం.అయినా రాముకి తన బండి మీద లిఫ్ట్ ఇచ్చిన మళ్ళ సూరి రామూ తన శతృవు కొడుకని తెలిశాక,అతని కోసం వెతకినా అక్కడక్కడే ఉండి దొరక్క పోవటం,అదీ ఒక చిన్న పల్లెటూరిలో కొంచెం విచిత్రంగానే ఉంటుంది.ఇలాంటి సన్నివేశాలు ఈ సినిమాలో అక్కడక్కడ కనపడటంతో ప్రేక్షకుడు కాస్త అసహనానికి గురవుతాడు.ఇలా ఎందుకు రాయాల్సి వచ్చిందంటే రాజమౌళి ఎంత కమేడియన్ సునీల్ తో సినిమా చేస్తున్నా,అతని దర్శకత్వ ప్రతిభకు ప్రేక్షకుల్లో ఉన్న ఇమేజ్ సామాన్యమైంది కాదు.అందులోనూ ఇంత వరకూ ఫ్లాప్ లేని దర్శకుడిగా అతనికున్న పేరు,దీనికి ముందు "మగధీర"వంటి ఒక అద్భుతమైన సినిమాకి దర్శకత్వం వహించటం వల్ల ఈ సినిమా గురించి ఇంత డిటైల్డ్ గా రాయవలసి వస్తోంది.ఇక హీరోయిన్ రామూని ప్రేమించటానికి చూపించిన కారణం ఆమె బావ ప్రోత్సాహం తప్పిస్తే అంత బలంగా లేదు.అదీ గాక ఆమె బావ ఆమెను పెళ్ళి చేసుకోవటానికి ఒప్పుకున్న కారణం కూడా"తెలుగమ్మాయి"అన్న పాటలో రామూ ఆ అమ్మాయి గొప్పతనం గురించి చెప్పినందువల్ల అనేది కూడా అంత సబబుగా లేదు.అయితే ఈ సినిమా రాజమౌళి రెగ్యులర్ గా చేసే జోనర్ సినిమా కాదు.అయినా అతనీ సినిమాని ఉన్నంతలో బాగానే తీయగలిగాడు.నిర్మాణపు విలువలు బాగున్నాయి.

Key points:


నటన - సునీల్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడనేది సినిమా అంతా ప్రతీ ఫ్రేం లో కనపడుతుంది.అతని నటన చూస్తూంటే అతను అతిగా వళ్ళు దగ్గరపెట్టుకుని మరీ నటించాడనిపిస్తుంది.ఇక డ్యాన్సుల్లో ఒకటి రెండు తప్ప అతని మూమెంట్స్ హీరోగా అతని తొలి"అందాల రాముడు"చిత్రంలోనే బాగున్నాయేమోననిపిస్తుంది.ఇక సలోనీ ఆశ్చర్యకరంగా చాలా బాగా నటించింది.నాగినీడుకి ఇది తొలి చిత్రమే అయినా ఆయనా ఆ పాత్రలో సరిగ్గా ఒదిగిపోయాడు.సుప్రీత్,ప్రభాకర్ లకు ఆ పాత్రలు టైలర్ మేడ్ వంటివి.బ్రహ్మాజీ తల్లి పాత్ర అవసరానికి మించి కళ్ళు తిప్పటం,అనవసరపు ఓవర్ యాక్షన్ లు తప్ప మిగిలిన వాళ్ళంతా వారి వారి పాత్రలకు న్యాయం చేశారు.
సంగీతం - బాగుంది.పాటలన్నీ బాగున్నా "రాయె రాయె రాయె రాయే సలోనీ" అనే పాట మాస్ జనానికి బాగా పట్టుకుంటుంది.అలాగే "తెలుగమ్మాయీ తెలుగమ్మాయి"అనే పాట కూడా ప్రేక్షకులందరికీ నచ్చే పాటవుతుంది.ఇక రీ-రికార్డింగ్ బాగుంది.
ఫొటోగ్రఫీ - రామ్ ప్రసాద్ కేమేరా పనితనం చాలా బాగుంది.నిజానికి ఏది ఒరిజనలో,ఏది గ్రాఫిక్స్ అనేది అర్థం కానంత గొప్పగా ఈ చిత్రంలో ఫొటోగ్రఫీ ఉంది.
ఎడిటింగ్ - చాలా బాగుంది.ఎక్కడా అనవసరమైన ల్యాగ్ లేకుండా నీట్ గా కట్ చేశారు.
మాటలు - గొప్పగా లేకపోయినా చెత్తగా కూడా లేవు.
పాటలు - ఈ చిత్రం లోని పాటల్లో సాహిత్యం బాగుంది.
ఆర్ట్ - చాలా బాగుంది.
కొరియోగ్రఫీ - ఒ.కె.అనే స్థాయిలో ఉంది.గొప్పగా మాత్రం లేదు.
యాక్షన్ - బాగుంది.కానీ టాటా సుమోకి కూడా దొరకనంత స్పీడ్ గా సైకిల్ తోక్కటం సాధ్యం కాదేమోననిపించింది.ఏమోలేండి తెలుగు సినిమాలో ఏదైనా సాధ్యమే.ఏమంటారు.

by

Avinash

tenali