LIVE AND EXCLUSIVE FROM SKY WALK
RATING : 3.75/5
USER RATING DISABLED FOR THIS REVIEW
IN ONE LINE::ఇది చిన్న సినిమా.కానీ బాగా తీశారు.ఇది ఒక విభిన్నమైన కథ,కథనాలతో గ్రామీణ నేపథ్యంలో తీసిన చిత్రం.సహజత్వానికి దగ్గరగా ఉండేలా ఈ చిత్రాన్ని తీశారు.మీకు అలాంటి సినిమా చూడాలనుకుంటే ఈ సినిమా తప్పకుండా చూడండి.
STORY::
భీమిలి గ్రామంలో సూరి పేద పిల్లవాడు.అతనికి చిన్నతనం నుండీ కబడ్డీ ఆటంటే బాగా ఇష్టం.అతనిలాగే ఆ ఊరిలో మరికొంతమంది కుర్రాళ్ళకి కూడా కబడ్డీ ఆటంటే ఇష్టం.సూరికి చిన్నతనం లోనే తండ్రి పోవటంతో అతను ఆ ఊరి దొర దగ్గర పాలేరుగా చేరాల్సి వస్తుంది.భీమిలీ కుర్రాళ్ళు కబడ్డీ ఆడటమే కానీ ఏనాడూ గెల్చిన పాపాన పోలేదు.భీమిలిలో జరిగే జాతరకు రాజమండ్రిలో డిగ్రీ చదివే ఓ అమ్మాయి తన అన్నవదినల ఇంటికి వస్తుంది.ఆమె సూరి అంటే ఇష్టపడుతుంది.సూరి కూడా ఆమె అంటే ఇష్టపడతాడు.జాతర పూర్తవగానే ఆమె రాజమండ్రి వెళ్ళిపోతుంది.రాజమండ్రిలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు జరుగుతున్నాయని తెలిసి భీమిలీ జట్టు కూడా అక్కడికి వెళుతుంది.ఆ తర్వాత ఏమయిందనేది మిగిలిన కథ.
ANALYSIS
దర్శకుడు సత్య తొలిసారి దర్శకత్వం వహించినా బాగానే తన బాధ్యతను నిర్వర్తించాడని చెప్పాలి.కాకపోతే సినిమా తొలి సగం కన్నా
ద్వితీయార్థం ఇంకా బాగుంది.దానికి పకడ్బందీ స్క్రీన్ ప్లే కారణం.చిన్న చిన్న తప్పులున్నా అవేం పెద్ద పట్టించుకోవలసినవి కాదు.అంటే ఉదాహరణకు రాజమండ్రిలో ఆటలో చనిపోయిన సూరి శవాన్ని భీమిలీకి తెచ్చినప్పుడు షర్ట్ మారటం వంటివి.మొత్తానికి సినిమాని బాగానే హ్యాండిల్ చేయగలిగాడు దర్శకుడు సత్య.
PROSPECTIVE::
నటన - హీరోగా నాని బాగానే నటించాడు.చాలా లో ప్రొఫైల్లో అతని పాత్ర ఉంటుంది.అయినా అతనా పాత్రను చక్కగా పోషించాడు.అతని హావభావాల్లో చక్కని పరిణితి కనిపిస్తుంది.నటుడిగా యువ హీరోల్లో మంచి భవిష్యత్తున్న హీరో అవుతాడు నాని.ఇక హీరోయిన్ శరణ్య
నటించటానికి పెద్దగా ఏం లేదు.ఉన్నంతలో ఆమె కూడా బాగానే నటించింది.కబడ్డీ జట్టులోని సభ్యులంతా ఫరవాలేదనిపించారు.కబడ్డీ కోచ్ గా నటించిన
కిశోర్ ఇంకా బాగా నటించి ఉండొచ్చు."సై" సినిమాలో రాజీవ్ కనకాల రేంజ్ లో ఇతని నటనుంటే ఈ చిత్రం ఇంకా బాగుండేది.మిగిలిన వారంతా తమ
తమ పాత్రలకు న్యాయం చేశారు.
సంగీతం - సెల్వ గణేష్ సంగీతంలోని పాటల కన్నా రీ-రికార్డింగ్ ఇంకా బాగుంది.పాటల్లో "పదపదమని తరిమినదే"అన్నపాట వినటానికి చూడటానికి
కూడా బాగుంది.
మాటలు - అద్భుతంగా లేకపోయినా బాగున్నాయి.
పాటలు - సాహిత్యం బాగుంది.
ఎడిటింగ్ - ఫరవాలేదు.
ఆర్ట్ - ఒ.కె
కొరియోగ్రఫీ - ఇది కూడా ఫరవాలేదు.
యాక్షన్ - సహజంగా ఉంది.
ఇది చిన్న సినిమా.కానీ బాగా తీశారు.ఇది ఒక విభిన్నమైన కథ,కథనాలతో గ్రామీణ నేపథ్యంలో తీసిన చిత్రం.సహజత్వానికి దగ్గరగా ఉండేలా ఈ చిత్రాన్ని తీశారు.మీకు అలాంటి సినిమా చూడాలనుకుంటే ఈ సినిమా తప్పకుండా చూడండి.