sye aata review::


http://sphotos.ak.fbcdn.net/hphotos-ak-snc4/hs013.snc4/34035_130865590281211_116194468414990_195666_5303491_n.jpg
live and exclusive from AGS గోల్డ్ CINEMAS చెన్నై
సెంటర్ లో ఎలా ?
A -CNTER : avg

B-CENTER : avg

C -CENTER: avg

ఒక లైన్ లో సూటిగా చెప్పాలంటే ::ఈ సినిమా టైపాంస్ కి మీకేమీ తోచకపోతే చూడాలనిపిస్తే చూడండి.మీ ఇష్టం.

rating :: 2.5/5

user rating : 2/5
(sms ur rating as movie name (space ) rating to 9848117007)





"సై ఆట" అనే ఒక రియాలిటీ డ్యాన్స్ షోకి వైజాగ్ నుండి తన టీమ్ తో వచ్చిన దుర్గా మల్లీశ్వరి (ఛార్మి)అనే అమ్మాయికి, హైదరాబాద్ లో ఉండే శంకర్ బాబాయ్ (కోట),పండిట్‍ (డాక్టర్ శివప్రసాద్) అనే ఇద్దరు గూండాల వల్ల ఎటువంటి ఇబ్బందులు వచ్చాయి...?వాటిని ఆమె ఏవిధంగా ఎదుర్కొన్నదీ...? అసలు మల్లీశ్వరి ఎవరు...? అన్నది ఈ చిత్రం కథ.


Analysis

ఈ కథ మంచిదే కానీ కథనం సరిగ్గా లేదు.ఎందుకంటే స్క్రీన్ ప్లే సరైన దారిలో లేదు.సినిమా ఫరవాలేదు అనుకునే లోపే సినిమా టెంపో పడిపోతుంది.ఛార్మి పాత్ర చివరి వరకూ ముసుగులో ఉంచుతాడు దర్శకుడు.అది బాగుంది కానీ మిగిలిన పాత్రలు అంటే కోట,శివ ప్రసాద్,అజయ్,ప్రభాకర్,రావురమేష్ రావుల పాత్రలకు అవసరమైన ఐడెంటిటీ లేకుండా ఉండి,రొటీన్ గా సాగటం ఈ చిత్రానికి పెద్ద మైనస్ పాయింట్.ఆటా పోటీలో పిల్లల డ్యాన్సు మాత్రం ఫరవాలేదనిపించే స్థాయిలో ఉంది.ఛార్మి పాత్ర కూడా ప్రేక్షకులను మిస్ లీడ్ చేయటానికే దర్శకుడు ఎక్కువగా వాడుకున్నాడు కానీ ఆ పాత్రను వాడుకోవాల్సిన తీరులో వాడుకోలేదనిపిస్తుంది.ఈ సినిమా గురించి ఇంతకంటే రాయటం అనవసరం.


సంగీతం - దేవీశ్రీ ప్రసాద్ సంగీతం ఆశించిన స్థాయిలో లేదనే చెప్పాలి.ఒకటి,రెండు పాటలు మాత్రం ఫరవాలేదనిపిస్తాయి.రీ-రికార్డింగ్ ఒ.కె.

మాటలు,పాటలు - ఈ రెం డూ కూడా సీరియల్ స్థాయిలో ఉన్నాయే కానీ సినిమా స్థాయిలో లేవు.అక్కడక్కడ ఒక డైలాగ్ బాగుంది.ఉదాహరణకు "వాడు అమ్మ కొడుకు కాబట్టి అమ్మ రాజశేఖర్ అని పెట్టుకున్నాడు.నేను నాన్నకొడుకుని కాబట్టి నాన్న చంద్రశేఖర్ అని పెట్టుకున్నాను"అనే ఆలీ డైలాగు చాలుగా ఈ సినిమాలో మాటలెలా ఉన్నాయో చెప్పటానికి.

ఎడిటింగ్ - ఈ సినిమాలో ఎడిటర్ పెద్దగా చేయటానికేం లేదు.

ఆర్ట్ - ఫరవాలేదు.

కొరియోగ్రఫీ - ఒక పాటలో మాత్రం బాగుంది.పిల్లల డ్యాన్సుల్లో బాగుంది.

యాక్షన్ - దీన్లో యాక్షన్ ఏమంత చించేసిందనో ఇద్దరు ఫైట్ మాస్టర్లను పెట్టారో అర్థంకాదు.