|
avinash media Rating | ||
2.75/5 | ||
Release Date | ||
25-9-2009 | ||
Story | ||
1982 లో తమిళనాడులో కథ మొదలవుతుంది. రైస్ ప్లేట్ రెడ్డి (నాజర్) అనే వ్యక్తి శాఖాహారాన్ని అందరు మానాలనీ, మాంసాహారాన్నే అంతా తినాలనీ, హోటళ్ళన్నింటిలో తన గూండాలను పంపించి బలవంతంగా మాంసాహారాన్నే మెనులో చేరుస్తూంటాడు. క్విక్ గన్ మురుగన్ (రాజేంద్రప్రసాద్ ), దీన్ని వ్యతిరేకిస్తాడు. దాని ఫలితం క్విక్ గన్ మురుగన్ ని రైస్ ప్లేట్ రెడ్డి చంపేస్తాడు. యమలోకం నుండి వాహనం వచ్చి క్విక్ గన్ మురుగన్ ని తీసుకెళుతుంది. అక్కడికి బయలుదేరింది మొదలు క్విక్ గన్ మురుగన్ "నేను వెనక్కి వెళ్ళాలి"అంటూనే ఉంటాడు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత సి.గుప్త (వినయ్ పాథక్) అదిప్పుడే కుదరదనీ, తొందరపడితే నీకే నష్టమనీ, అలా తొందరపడిన ఒకావిడ మిడతలా జన్మించిందనీ ఉదాహరణ చూపిస్తాడు. అయినా క్విక్ గన్ మురుగన్ తన పట్టు వదలడు. దాంతో అతన్ని తిరిగి భూలోకానికి పంపిస్తాడు సి.గుప్త. అలా వచ్చిన క్విక్ గన్ మురుగన్ ముంబాయిలో తేలతాడు. అక్కడ నుంచీ రైస్ ప్లేట్ రెడ్డి ఎక్కడున్నాడాని వెతుకుతుంటాడు క్విక్ గన్ మురుగన్. రైస్ ప్లేట్ రెడ్డి ప్రస్తుతం మెక్ దోశ తయారుచేయటానికి ముంబాయిలోని వంట బాగా చేసే అమ్మలందర్నీ కిడ్నాప్ చేయిస్తూ, వారితో అద్భుతమైన దోశలు ఎలా చేయాలో ప్రయోగాలు చేస్తుంటాడు. చివరికి క్విక్ గన్ మురుగన్, మ్యాంగో డాలీ (రంభ) అనే డ్యాన్సర్ ద్వారా రైస్ ప్లేట్ రెడ్డి ఏంచేస్తున్నాడో తెలుసుకుంటాడు. ఈలోగా క్విక్ గన్ మురుగన్గురించి తేలుసుకున్న రైస్ ప్లేట్ రెడ్డి తన వద్ద పనిచేసే రావడీ యమ్.బి.యె.(రాజు సుందరం)ని క్విక్ గన్ మురుగన్ ని అంతం చేయటానికి పంపిస్తే, క్విక్ గన్ మురుగన్ అతన్నే చంపుతాడు. ఇక క్విక్ గన్ మురుగన్ శాఖాహారంతో కూడిన డబ్బా భోజనం మంచిదనీ, రైస్ ప్లేట్ రెడ్డి మాంసాహారం తినవద్దనీ ఒక టి.వి.ఇంటర్వ్యూ లో చెపుతాడు. దాంతో క్విక్ గన్ మురుగన్ డబ్బా భోజనాల్లాంటివి బాంబులు పెట్టి తయారు చేసి అల్లకల్లోలం సృష్టిస్తాడు రైస్ ప్లేట్ రెడ్డి. చివరికి అతన్ని క్విక్ గన్ మురుగన్ ఎలా అంతం చేశాడనేది మిగిలిన కథ. | ||
Analysis | ||
ఈ చిత్రం చూస్తుంటే గతంలో "స్లమ్ డాగ్ మిలియనీర్ "అనే చిత్రం ద్వారా, సినిమాల్లో భారతీయులందర్నీ వీధి కుక్కలతో పోల్చారు. ఆ విషయాన్ని లక్ష్మీ భూపాల్ అనే సినీ రచయిత "మహాత్మ" అనే చిత్రంలో తన వ్రాసిన పాట ద్వారా స్పష్టీకరించారు. దాన్ని ఈ రివ్యూ ద్వారా ఈ విలేఖరి కూడా బలపరుస్తున్నాడు. ఇక "క్విక్ గన్ మురుగన్"చిత్రం మాత్రం దక్షిణాది వారిని ముఖ్యంగా తమిళనాడు ప్రజలను జోకర్లు చేసినట్టనిపిస్తుంది.హీరోకి పాత సినిమాల్లోని యమ్.జి.ఆర్ .గెటప్పు వేసి, దిక్కుమాలిన ఇంగ్లీష్ మాట్లాడిస్తూ, మధ్యలో తెలుగు, తమిళ, హిందీ భాషల్ని ఉపయోగిస్తూ ఈ చిత్రంలో తమిళియన్స్ అంటే ఇలా జోకర్లలా ఉంటారు అనే అభిప్రాయం కలిగేలా ఈ చిత్రం ఆద్యంతం అనిపిస్తుంది. ఇక దర్శకుడు, సినిమా సాంకేతికంగా ఒ.కె.కానీ కథ, కథనం మాత్రం చాలా నిదానంగా ఇబ్బందికరంగా ఉంటాయి. అక్కడక్కడా కొన్ని జోకులు మాత్రం పేలాయి. అలాగని ఓ పది జోకుల కోసం సినిమా మొత్తం భరించలేం కదా.ఇక నటుడిగా రాజేంద్ర ప్రసాద్ గొప్పగా నటించింది కూడా ఈ చిత్రంలో పెద్దగా ఏం లేదు.అతని లాకెట్‍లో అతని చనిపోయిన లవర్ కనపడి క్విక్ గన్ మురుగన్ తో మాట్లాడటం సినిమాకేం పేద్దగా ఉపయోగపడదు.ఒకప్పుడు రంభ స్థాయి ఒకప్పుడేంటి...? ఈ సినిమాలో ఏంటి...? వేషాల్లేని స్థితిలో గతిలేక ఈ పాత్రలో నటించినట్టు అనిపించింది. | ||
avinash Perspective | ||
సంగీతం-: ఒక విభిన్నమైన సంగీతం ఈ చిత్రంలో మనం వినవచ్చు. "లిటిల్ ఫ్లవర్" పాట బాగుంది.అలాగే రీ-రికార్డింగ్ కూడా బాగుంది. సినిమాటోగ్రఫీ-: చాలా బాగుంది.ముఖ్యంగా ఈ సినిమాలో మనకు బాగా నచ్చేవి విజువల్ ఎఫెక్టులు.ఈ సినిమాలో గ్రాఫిక్స్ బాగున్నాయి.పిల్లలకు బాగా నచ్చుతుంది. ఎడిటింగ్-: ఒ.కె. ఆర్ట్-: చాలా బాగుంది. ఈ సినిమాలో 1982 కీ నేటికీ తేడా చక్కగా కనిపించింది. అందుకు కారణం ఆర్ట్ డైరెక్టర్ పనితనం. యాక్షన్-: నీట్ గా ఉంది. ఎంతబాగున్నా అడవిలో కాసిన వెన్నెలే కదా. |