Movie Name "గణేష్" జస్ట్ గణేష్‌ avinash media Rating : 3.5/5
Banner శ్రీ స్రవంతి మూవీస్

Producer స్రవంతి రవికిశోర్
Director శరవణన్
Music మిక్కీ.జె.మేయర్
Photography హరి అనుమోలు
Story శరవణన్
Dialouge అబ్బూరి రవి

Lyrics సిరివెన్నెల సీతారామ శాస్త్రి,
రామజోగయ్య శాస్త్రి

Editing శ్రీకరప్రసాద్

Art పేకేటి రంగా

Choreography రాజు సుందరం, సుచిత్ర చంద్రబోస్, శోబి

Action పీటర్ హేయిన్స్

Star Cast రామ్, కాజల్‍ అగర్వాల్, ఆశిష్ విద్యార్థి,
కాశీ విశ్వనాథ్, సమీర్ ‍, బ్రహ్మానందం,
శివారెడ్డి, పూనం కౌర్, రోహిణి హట్టంగడి,
సుధ, సురేఖా వాణి, సన, రజిత, అపూర్వ,
మరియూ 26 మంది పిల్లలు ...తదితరులు.



avinash media Rating
3.5/5
Release Date
24-09-2009
Story
గణేష్(రామ్ ‍) అనే ఒక అనాథ తన స్నేహితుడు, స్నేహితురాలు ప్రేమించుకుంటే వాళ్ల ప్రేమకున్న అడ్డంకులు తొలగించటానికి చేసే ప్రయత్నంలో తాను కూడా దివ్య (కాజల్ అగర్వాల్‍ ) అనే ఒకమ్మాయితో ప్రేమలో పడి, మధ్యలో ఆ అమ్మాయి తనను అపార్థం చేసుకోవటం, చివరకు ఆ అపార్థం తొలగి అతని ప్రేమ సఫలత చెందటం క్లుప్తంగా ఈ చిత్రం కథ. గణేష్ స్నేహితుడు ప్రేమించిన అమ్మాయికి దుబాయ్ లో ఉండే వాళ్ళనాన్న తన కూతురుకి త్వరగా పెళ్ళి చేయాలనుకుంటాడు. ఆ అమ్మాయి తను ప్రేమించిన వాడిని చేసుకోవాలనుకుంటుంది. కానీ ఆమె ప్రేమించిన అబ్బాయి తండ్రి (కాశీ విశ్వనాథ్) తన అక్క (సుధ) కూతురు దివ్యకిచ్చి అతని వివాహం జరిపించాలనుకుంటాడు. అయితే అక్క, అతను ఏదో మాట పట్టింపులొచ్చి మాట్లాడుకోరు. అందుకని గణేష్ తన స్నేహితుడి పెళ్ళి జరగాలంటే అతనికి అత్త కూతురు వేరే ఎవరినైనా ప్రేమిస్తే సమస్య పరిష్కారం అవుతుందని, ఆమెను తానే ప్రేమిస్తున్నట్టు నటిస్తానని తన స్నేహితుడితో అంటాడు గణేష్. ఆమెను ప్రేమిస్తున్నట్టు నటించటానికి కొండాపూర్‌లో ఉన్న ఎక్స్ ప్రెస్ టవర్స్ లో ఒక ప్లాట్ సంపాదిచాలనుకుంటాడు గణేష్.

కానీ అక్కడుండే పిల్లలు ఒక్కొక్కడూ అయిదేళ్ళ బిన్ లాడేన్ ‍, పూలన్ దేవి లాంటి వాళ్ళు. వాళ్ళదెబ్బకి అందరూ భయపడు తూంటారు. కానీ వాళ్ళకి తమకు ట్యూషన్ చెప్పే దివ్యంటే భయం. అనుకోకుండా ఆ పిల్లలకు గణేష్ సూపర్ మ్యాన్ లా కనిపిస్తాడు. దాంతో ఆ పిల్లల సాయంతో అక్కడ ఫ్లాట్ సంపాదించి దివ్యకి లైనెయ్యటం మొదలు పేడతాడు. కానీ దివ్య అతన్ని పట్టించుకోదు. గణేష్ దివ్యను ప్రేమిస్తున్నట్టు దివ్యకు చెప్పి, ఆమెకు తాను గణేష్ స్నేహితుడిలా పరిచయమవుతాడు. ముందు దివ్యను ప్రేమిస్తున్నట్టు నటించినా, చివరికి గణేష్ ఆమెను నిజంగానే ప్రేమిస్తాడు. అలా ఆమె ప్రేమను పొందిన గణేష్ దగ్గరికి తన స్నేహితుడి ప్రియురాలు వచ్చి "గణేష్ నువ్వు ప్రేమను నటిస్తూంటేనే దివ్య అంతలా ప్రేమిస్తుంది. ఇక నువ్వు నిజంగానే ప్రేమిస్తే ఆమె ఇంకెంత ప్రేమిస్తుందో" అంటూండగా దివ్య ఆమె మాటలు వింటుంది. దాంతో సీన్ రివర్స్ అవుతుంది.. మరి దివ్య మనసులోని అపార్థాన్ని గణేష్ ఎలా తొలగించాడు...? ఆమె ప్రేమను ఎలా పొందాడన్నది మిగిలిన కథ.
Analysis
శరవణన్ కిది దర్శకుడిగా తొలి చిత్రం. అయినా కొత్త దర్శకుడి తడబాటు మనకీ చిత్రంలో కనపడదు. ఒక కొత్త ఫీల్ తో, ఈ చిత్రాన్ని చక్కని స్క్రీన్ ప్లే తో, నీట్ గా ప్రెజెంట్ చేశాడు. ఒక చిన్న లైన్ ఆధారంగా ప్రేక్షకులను ఓ రెండున్నర గంటలు కూర్చోపెట్టటం సామాన్యమైన విషయం కాదు. కుటుంబ సమేతంగా చూసేలా, యువతకు నచ్చేలా, అలాగే మాస్ కి కావలసిన ఎలిమెంట్స్ జోడిస్తూ, అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని మలిచాడు శరవణన్. ఇక పాతలో వచ్చే కొన్ని సెకన్ల షాట్ కోసం ఎటియమ్ లో ఐస్ క్రీములొచ్చేలా, ఒక పెద్ద మ్యాగీ గుట్టని ఏర్పాటుచెయ్యటం, ఒక కూల్ డ్రింక్ ఫౌంటెన్ ఏర్పాటు చెయ్యటం ఒక్క స్రవంతి రవికిశోర్ కే చెల్లింది. నిర్మాణపు విలువలు బాగున్నాయి.
avinash verdict
నటన-: ఈ చిత్రంలో రామ్ నటనలో కొత్త కోణాన్ని చూస్తారు. అతనిలో ఎంత ఏనర్జీ ఉందో అతని గత చిత్రాల్లో మనం చుశాము. ఈ చిత్రంలో అతను ట్రాజెడి సీన్లో కూడా నటించి ప్రేక్షకుల మనసులు చెమ్మగిల్లేలా నటించాడు. ఇక డ్యాన్సుల్లో, ఫైట్స్ లో రామ్ గురించి కొత్తగా చెప్పేదేముంది. కాజల్‍ కూడా యధాశక్తి తన పాత్రకు న్యాయం చేసింది. పూనమ్ కౌర్ హీరోయిన్ స్నేహితురాలిగా గౌరవ పాత్రలో బాగానే నటించింది. ఆశిష్ విద్యార్థి, బ్రహ్మానందం కామెడి ఫరవాలేదు.ఇక పిల్లలంతా బాగా నటించారు. కాశీ విశ్వనాథ్, సుధ, సమీర్ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు.
సంగీతం-: మిక్కీ.జె.మేయర్ సంగీతం వినసొంపుగా ఉంది. అన్ని పాటలూ బాగున్నాయి. రీ-రికార్డింగ్ కొత్తగా ఉంది.
కెమేరా-: సీనియర్ కెమేరామెన్ హరి అనుమోలు కెమేరా వర్క్ చూడముచ్చటగా ఉంది. ముఖ్యంగా పాటల్లో ఇంకా బాగుంది.
మాటలు-: ఈ సినిమాలో మాటలు బాగున్నాయి. "హీరో, హీరోయిన్ తో క్లైమాక్స్ లో చెప్పే " ప్రాణం పోతుంటే ఎలా ఉంటుందో నాకు తెలియదు. కానీ నిన్ను వదిలి వెళుతుంటే నాకంతకన్నా బాధగా ఉంది. కానీ ఒక్కటి గుర్తుంచుకో. క్షమించగలిగిన వారే ఎక్కువగా ప్రేమించగలరు" వంటి మాటలు హృదయానికి హత్తుకుంటాయి.
పాటలు-: ఈ చిత్రంలో ఒక్కపాట సిరివెన్నెల రాస్తే, మిగిలిన పాటలన్నీ రామజోగయ్య శాస్త్రి వ్రాశారు. అన్ని పాటల్లోనూ సాహిత్యం బాగుంది. క్లైమాక్స్ సాంగ్ ఇంకా బాగుంది.
ఎడిటింగ్-: నీట్‍గా, ల్యాగ్ లేకుండా బాగుంది.
కొరియోగ్రఫీ-: ఈ చిత్రంలో రామ్ చేసిన నృత్యాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అన్ని పాటల్లోనూ కొరియోగ్రఫీ బాగుంది.
యాక్షన్-: రామ్ ఈ చిత్రంలో ట్రిపుల్‍ నన్ చాకులా కనిపించే "శాన్ సెట్ సుకోన్" అనే మనకు తెలియని నూతన ఆయుధాన్ని క్లైమాక్స్ ఫైట్ లో వాడిని తీరు బాగుంది. మిగిలిన యాక్షన్ సీన్లు కూడా బాగున్నాయి.

ఇది ఫీల్ గుడ్ మూవీ. ఈ చిత్రాన్ని సకుటుంబంగా చూడవచ్చు. అశ్లీలత లేదు, అసభ్యత లేదు. ముఖ్యంగా అబద్ధం చెప్పకూడదు, బద్దకాన్ని వదలాలి, కష్టపడి చదవాలి అప్పుడే పిల్లలు సూపర్ మ్యాన్ అవుతారనే సందేశాన్నిచ్చినందు వల్ల ఈ చిత్రాన్ని చిన్న పిల్లలకు చూపిస్తే బాగుంటుంది.