| 
 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| avinash media Rating | ||
| 4/5 | ||
| Release Date | ||
| 18-9-2009 | ||
| Story | ||
| ఉగ్రవాదాన్ని అంతం చేయటానికి ఉగ్రవాదమే సరైనదని భావించిన ఒక సామాన్యుడికి ఉగ్రవాదం మీద ఆగ్రహం కలిగితే అతనేం చేయగలడనేది ఈ చిత్రం కథ. ఇక కథ విషయంలోకి వస్తే ఒక మాజీ కమీషనర్ ఆఫ్ పోలీస్ ఈశ్వరప్రసాద్ (వెంకటేష్ Venkatesh Interviews) తన స్వగతంలో గతం గురించి నెమరువేసుకుంటూంటాడు. పచ్చభొట్ల శ్రీనివాస్ అనే ఒక సగటు వ్యక్తి "ఐ లవ్ ఇండియా" అనే బ్యాగుల్ని ఐమాక్స్ థియేటర్లో, బస్సులో, రైల్లో వదిలేసి వెలుతూంటాడు. ఆ బ్యాగుల్లో ఏముందో మనకి తేలీదు. అతను లకడీకాపూల్ పోలీస్ స్టేషన్ కు వెళ్ళి తన పర్సు పోయిందని కంప్లైంట్ ఇవ్వటానికి వెళ్ళి, ఆ తర్వాత అక్కడి టాయ్ లెట్ లో ఒక బ్యాగుని వదిలేస్తాడు. అప్పుడు అతను తన భార్య ఫోన్ లో చెప్పిన కూరగాయలు కొనుక్కుని వాటితో పాటు ఒక బెడ్డింగ్ కూడా తీసుకుని కట్టుబడిలో ఉన్న ఓ పది అంతస్తుల భవనం టాప్ మీదకు చేరుకుని అక్కడ బెడ్డింగ్ లోంచి తను తెచ్చుకున్న ఎలక్ట్రానిక్ పరికరాలను, సెల్ ఫోన్ సిమ్ కార్డులనూ బయటకు తీసి వాటినన్నింటినీ తనకు కావలసిన పద్ధతిలో ఏర్పాటుచేసుకుని అప్పుడు కమీషనర్ ఆఫ్ పోలీస్ ఈశ్వరప్రసాద్ కి ఫోన్ చేసి తాను సిటీలో జనం బాగా తిరిగే అయిదు ప్రదేశాల్లో అత్యంత శక్తివంతమైన బాంబులను అమర్చాననీ, ఒక అరగంటలో మళ్ళీ ఫోన్ చేస్తాననీ, అప్పుడు తనతో మాట్లాడే వ్యక్తి బాధ్యత కలిగిన వారై ఉండాలనీ, తన డిమాండ్లను అంగీకరిస్తేనే ఆ బాంబులను తానెక్కడెక్కడ అమర్చిందీ తెలియజేస్తాననీ చెపుతాడు. ఇంతకీ అతని డిమాండేమిటంటే అల్ ఖైదాతో సన్నిహిత సంబంధాలున్నఅతి తీవ్రమైన నలుగురు ముస్లిం ఉగ్రవాదులను వెంటనే ఒక్కచోట చేర్చాలనీ అంటాడు. వెంటనే కమీషనర్ ఆఫ్ పోలీస్ ఈశ్వరప్రసాద్ ఛీఫ్ సెక్రెటరీ (లక్ష్మీ)ని తన ఆఫీసుకి రమ్మని చెపుతాడు. ఆమె రాగానే ఆమెకు జరిగిన సంగతి చెపుతాడు. ఆమె ముఖ్యమంత్రితో ఫోన్ లో మాట్లాడి, ఈ వ్యవహారంలో ఎంచేయాల్సిందీ, ఎలా చేయాల్సిందీ నిర్ణయం తీసుకునే అధికారాన్ని పొందుతుంది. కానీ ఇందులో ఏదన్నా తేడా వస్తే అంతా తన మెడకు చుట్టుకుంటుందన్న భయంతో, ఈ వ్యవహారంలో ఈశ్వరప్రసాద్ కి ఆ బాధ్యతనప్పజెప్పుతుంది. అప్పుడు ఫోన్ చేసిన శ్రీనివాస్ తన డిమాండ్లను చెపుతాడు. కానీ ఈశ్వరప్రసాద్ "నువ్వు బాంబులు పెట్టావంటానికి రుజువేంటి...?" అనడిగితే, దానికతను "పోయి లకడీకాపూల్ పోలీస్ స్టేషన్ కు పోయి చూస్కో"మంటాడు.       అక్కడ నిజంగానే ఆర్.డి.ఎక్స్. బాంబుంటుంది. దాంతో ఈశ్వరప్రసాద్ కి అతని మాటలు నమ్మక తప్పదు. అయినా అతన్ని పట్టుకోటానికి సాంకేతికంగా ఏమెం చేయగలడో ఆ ప్రయత్నాలన్నీ చేస్తుంటాడు. కానీ ఫలితం ఉండదు. తన మెరికల్లాంటి పోలీసాఫీసర్లు గౌతమ్ రెడ్డి, ఆరిఫ్ ఖాన్ లకు సెక్యూరిటీగా పంపిస్తాడు. చివరకు బేగం పేట ఏయిర్ పోర్టులో వాళ్ళని చేరిస్తే అక్కడున్న ఒక జీప్ లో వాళ్లని బయటకు పంపించమని చెపుతాడు. అతని మాట ప్రకారం నలుగుర్ని కాక, ముగ్గురినే ఆరీఫ్ ఖాన్ ఆ జీప్ లోకి పంపి అబ్దుల్లా అనే ఉగ్రవాదిని తన వద్దే బందీగా ఉంచుతాడు. జీప్ లోకి చేరుకున్న ముగ్గురు ఉగ్రవాదులూ, జీప్ స్టార్ట్ చేసి బయలుదేరేటంతలో ఆ జీప్ లో ఒక సెల్ ఫోన్ మ్రోగుతుంది. దాన్ని ఆన్ చేయగానే ఆ జీప్ బ్లాస్ట్ అయిపోతుంది.     అప్పుడు ఫోన్లో పోలీసులను పరిగెత్తించిన వ్యక్తి, ఈ ఉగ్రవాదులను చంపటానికే ఈ పథకం వేశాడని ఈశ్వరప్రసాద్ కి అర్థమవుతుంది. అతనెందుకలా చేశాడో ఒక హృదయవిదారక గాధని వివరంగా చెప్పాక, ఈశ్వరప్రసాద్ కూడా అతనితో ఏకీభవిస్తాడు. అతనే కాదు కంప్యూటర్ ఎక్స్ పర్ట్, ఆరీఫ్ ఖాన్ కూడా ఆ సగటు వ్యక్తి అభిప్రాయంతో ఏకీభవిస్తారు. ఫలితం మిగిలిన అబ్దుల్ ని కూడా ఆరీఫ్ ఖాన్ చంపేస్తాడు. ఆ సగటు వ్యక్తి తన కూరగాయలు తీసుకుని తన ఇంటికి వెళతాడు. ఈశ్వరప్రసాద్ తన ఉద్యోగానికి రాజీనామా చేస్తాడు. ఇదీ కథ... | ||
| Analysis | ||
| గతంలో నజీరుద్దీన్ షా, అనుపమ్ ఖేర్ లు నటించగా, బాలీవుడ్ లో వచ్చి, సంచలన విజయం సాధించిన "వేడ్నెస్ డే" చిత్రానికిది రీమేక్. అయితే ఆ చిత్రానికి ఈ చిత్రానికీ భావసారూప్యంలో ఒక చిన్న తేడా ఉంది. కానీ నిజంగా చెప్పాలంటే ఆ చిత్రం కన్నా ఈ చిత్రమే మన నేటివిటికి బాగా దగ్గరగా ఉంటుంది. తెలుగులో నజీరుద్దీన్ షా పాత్రలో కమల్ హాసన్, అనుపమ్ ఖేర్ పాత్రలో వెంకటేష్ నటించారు. ఇక దర్శకత్వం గురించి చెప్పాల్సి వస్తే , ఈ చిత్ర దర్శకుడి గురించి ఎంతచేప్పినా తక్కువే అవుతుంది. చక్రి తోలేటి ఈ చిత్రాన్ని చాలా బాగా తోలాడు. అంటే బాగా తీశాడు. టేకింగ్ చాలా బాగుంది. రిమేకయినా డ్రై సబ్జెక్టుతో నిండిన ఈ చిత్రాన్ని ఆసక్తికరంగా మలచటంలో అతని ప్రతిభ కొట్టొచ్చినట్టుకనపడుతూంది. కాకపోతే మొదటి రీల్లో కొంచెం నాన్ సింక్ డైలాగులున్నాయి. | ||
| avinashs Perspective | ||
| నటన-: కమల్ హాసన్ గురించి అతను చాలా మంచి నటుడని ఎంతని రాస్తాం, ఏమని రాస్తాం, ఎన్నిసార్లని రాస్తాం, ఎలా రాస్తాం. అతను ఈ సినిమాలో ఇప్పుడు బాగా చేశాడంటే హాస్యాస్పదమవుతుంది. అతనెలాంటి నటుడో భారతదేశం మొత్తం తెలిసిన సంగతే కదా. కాకపోతే ఇక్కడ వెంకటేష్ ధైర్యానికి హేట్సా ఫ్. కమల్ వంటి గోప్ప నటుడితో ఢీ అంటే ఢీ అంటూ నటించటం అంటే మామూలు విషయం కాదు. పరుచూరి గోపాలకృష్ణ "ఈనాడు'' ఆడియోలో ఫంక్షన్‌లో అన్నట్టు వెంకటేష్ కూడా సామాన్యుడు కాడు. తెలుగు కమల్ హాసన్ అనతగ్గ చక్కని నటుడు. అతనెక్కడా కమల్ కి నటనలో తగ్గలేదు. అందుకు అతని ఆత్మవిశ్వాసాన్ని మెచ్చుకోవాలి. సినిమా అంతా మనుషులు కలవకుండా వీళ్ళిద్దరి మధ్య జరిగే ఒక పోరాటం లాంటి సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. అలాగే సినియర్ నటి లక్ష్మీ తన పాత్రకు తాను న్యాయం చేసింది. ఐ.ఎ.యస్., ఐ.పి.యస్. ఆఫీసర్ ల మధ్య జరిగే కోల్డ్ వార్‌లు, వాటిలో ఎవరు ఎలా బలిపశువులవుతారో ఈ చిత్రంలో చక్కగా చూపించారు. ఇక గౌతమ్ రెడ్డి పాత్రధారి, ఆరీఫ్ ఖాన్ పాత్రధారులు, ఉగ్రవాద పాత్రధారులూ కూడా బాగా నటించారు. సంగీతం-: ఈ సినిమాలో ఉన్నది "అల్లాజానే...."అనే ఒక్కటే పాట. అదికూడా కమలే పాడారు. అది బాగుంది. కానీ దానికన్నాఈ చిత్రానికిచ్చిన రీ-రికార్డింగ్ ఇంకా బాగుంది. కెమెరా-: అద్భుతంగా ఉంది. మనోజ్ సోనీ అందించిన ఫొటోగ్రఫీ చాలా చాలా బాగుంది. మాటలు-: చాలా బాగున్నాయి. ఎడిటింగ్-: బాగుంది. ఆర్ట్-: తరణి పనితనం గురించి ఈ రోజు కొత్తగా చెప్పక్కరలేదు. ఆయన పద్మశ్రీ తోట తరణి. | 
 








