Movie Name బెండుఅప్పారావు (ఆర్‌.యమ్‌‌.పి.) avinash media Rating : 2.75/5
Banner సురేష్ ప్రొడక్షన్స్
Producer డాక్టర్ డి.రామానాయుడు
Director ఇ.వి.వి.సత్యనారాయణ
Music కోటి
Photography జయరామ్
Story పి.వి.గిరి
Dialouge వెలిగొండ శ్రీనివాస్

Lyrics

Editing గౌతంరాజు

Art బి.వెంకటేశ్వరరావు

Choreography నిక్షన్, గణేష్

Action

Star Cast నరేష్, కామ్నా జెఠ్మలానీ, ఆహుతి ప్రసాద్,
ఎ.వి.యస్., ఉత్తేజ్‍‍, శ్రీనివాసరెడ్డి, రఘుబాబు,
కొండవలస, యల్‍.బి.శ్రీరామ్, ధర్మవరపు
సుబ్రహ్మణ్యం, కృష్ణభగవాన్, సుమన్ శెట్టి,
తెలంగాణా శకుంతల, చలపతిరావు,
దీక్షితులు, ఆలీ, మేఘన తదితరులు.....


avinash media Rating
2.75/5
Release Date
16-10-2009
Story
బెండు అప్పారావు (నరేష్) బొబ్బర్లంక అనే ఊర్లో ఆర్ ‍.యమ్ ‍.పి.డాక్టర్. అతను జనం దగ్గర అందినంత సంపాదిస్తుంటాడు. దానికి కారణం కట్నం కోసం అప్పారావు చెల్లెల్ని అతని బావ హింసించటమే. ఆ ఊర్లో ఉండే సాగి సత్యనారాయణ రాజు (ఆహుతి ప్రసాద్)కూతురు (కామ్నా జెఠ్మలానీ) అప్పారావుని ప్రేమిస్తుంది. అప్పారావు కూడా ఆమెను ప్రేమిస్తుంటాడు. ఈ లోగా ఒక సంఘటన జరుగుతుంది. అనుకోకుండా 15 లక్షలు బెండు అప్పారావు చేతికి వస్తాయి. ఆ ధనాన్ని చనిపోతూ తనకిచ్చిన అతని కుటుంబానికి అందించటానికి అప్పారావు శతవిధాలా ప్రయత్నిస్తాడు. కానీ అతని తండ్రి మరణించాడని తెలుస్తుంది. దాంతో ఆ డబ్బులో కొంత సొంతానికి వాడుకుని, మిగిలిన డబ్బుతో ఆ ఊర్లో చనిపోయినతని పేరు మీద ఒక స్కూల్‍ని కట్టిస్తాడు అప్పారావు.

తర్వాత ఆ ఊరికి వచ్చిన టీచర్ తండ్రికి తన ఇల్లు తాకట్టు పెట్టి మరీ గుండె ఆపరేషన్ చేయించి, ఆ టీచర్‌ని పెళ్ళిచేసుకోటానికి సిద్ధమవుతాడు అప్పారావు. తను ప్రేమించిన రాజుగారి కూతురిని కాదని ఈ టీచర్‌ని అప్పారావు ఎందుకు పెళ్ళిచేసుకోవాలను కున్నాడు... అసలు ఆ టీచర్‌ ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే "బెండు అప్పారావు" ఆర్.యమ్.పి.సినిమా చూడాల్సిందే.
Analysis
ఇది ఇ.వి.వి.మార్కు కామెడీ చిత్రం. ఇందులో కొద్దో గొప్పో నవ్వించే సీన్లున్నాయి. నరేష్ నటన గురించి కొత్తగా చెప్పక్కర లేదు. కామ్నా జెఠ్మలానీ కుడా బాగానే నటించింది. ఆహుతి ప్రసాద్, ఉత్తేజ్‍, చలపతిరావు, శ్రీనివాసరెడ్డి, రఘుబాబు, కొండవలస, యల్‍.బి. శ్రీరామ్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, కృష్ణభగవాన్, సుమన్ శెట్టి తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.


avinash Perspective
సంగీతం-: ఈ సినిమాలో నాలుగు పాటలున్నాయి. నాలుగూ బాగున్నాయి. రి-రికార్డింగ్ కూడా బాగుంది.
కెమెరా-: బాగుంది. పాటల్లో ఇంకా బాగుంది.
మాటలు-: విపరితంగా నవ్వించకపోయినా, ప్రేక్షకులను బాగానే నవ్విస్తాయి.
ఎడిటింగ్-: బాగుంది
కొరియోగ్రఫీ-: నాలుగు పాటల్లోనూ కొరియోగ్రఫీ బాగుంది.

మీరు కాసేపు నవ్వుకోవాలనిపిస్తే ఈ సినిమా ఒకసారి చూడొచ్చు.

updated by avinash
form venus theater ,tenali