ఏక్‌ నిరంజన్‌
avinash media : 3/5
ఆదిత్యారామ్‌ మూవీస్‌
ఆదిత్యారామ్‌
పూరీ జగన్నాథ్‌
మణిశర్మ
శ్యాం.కె.నాయుడు
పూరీ జగన్నాధ్
పూరీ జగన్నాధ్

రామజోగయ్య శాస్త్రీ, విశ్వ,
భాస్కరభట్ల

యం.ఆర్‌.వర్మ

చిన్నా

రాజుసుందరం

స్టంట్‌ శివ

ప్రభాస్‌, కాంగనా రనౌత్‌, సోనూ సూద్,
తనికెళ్ళ భరణి, ముకుల్ దేవ్,
పోసాని కృష్ణమురళీ, అలీ,
బ్రహ్మానందం, బ్రహ్మాజీ, అభినయశ్రీ,
సునీల్, వేణు మాధవ్ తదితరులు...


avinash media Rating
3/5
Release Date
29.10.2009
Story
చోటు (ప్రభాస్‌)ని చిన్నతనంలోనే అపహరించి అడుక్కుతినేందుకు ఉపయోగిస్తాడు చిదంబరం అనే వ్యక్తి. ఆ వ్యక్తిని పోలీసులకి పట్టివ్వడంతో ఓ పోలీసు ఓ రూపాయి కాయిన్‌ చోటుకి ఇస్తాడు. క్రిమినల్స్‌ని పోలీసులకి పట్టిస్తే డబ్బులిస్తారన్న ఆలోచనతో చోటు క్రిమినల్స్‌ని పోలీసులకు పట్టిస్తూంటాడు. జానీబాయ్‌ (సోనూసూద్‌) ఓ మాఫియా లీడర్‌. అతని మనుషులని కూడా చోటు పోలీసులకి పట్టిస్తుండడంతో చోటుని టార్గెట్‌ చేస్తాడు జానీబాయ్‌. రాజకీయనాయకుడైన గరికపాటి నరేందర్‌ (పోసాని కృష్ణమురళి) మంత్రి కావడం కోసం తన అన్నయ్యని జానీబాయ్‌ మనుషుల చేత చంపిస్తాడు..

అయితే ఆ హత్య చేసిన గణేష్‌ (ముకుల్‌దేవ్‌)ని జానీబా య్‌ హత్య చేయాలని చూస్తాడు. జానీబాయ్‌ దగ్గర పనిచేసే మనోజ్‌ అనే రౌడీ చెల్లెలు సమీర (కంగనారనౌత్‌) చోటుకి పరిచయం కావడం, ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడం జరిగిపోతాయి.. వారిద్దరూ ప్రేమించుకోవడం ఇష్టంలేని మనోజ్‌ సమీరని బ్యాంకాక్‌ తీసుకెళ్తాడు. ఓ వైపు తన తల్లిదండ్రులెవరో తెలుసుకోవాలనే తపన, సమీరని దక్కించుకోవాలన్న ఆరాటం, మరోవైపు జానీబాయ్‌ హత్యచేయాలనుకుంటున్న గణేష్‌ని పట్టుకుని పోలీసులకి అప్పగించే బాధ్యత.. ఈ మూడింటిలో చోటు ఎంతవరకు సక్సెస్‌ సాధించాడన్నది తెలుసుకోవాలంటే సినిమా చూ డాల్సిందే..
Analysis
పూరీ జగన్నాథ్‌ చిత్రం అనగానే మాస్‌ ఆడియోన్స్‌లో హై ఎక్స్‌పెక్టేషన్స్‌ పెరిగిపోతాయి. హీరోయిజం చూపించడంలో పూరీ జగన్నాథ్‌ స్టైల్‌ మాస్‌ ఆడియెన్స్‌కి విపరీతంగా నచ్చుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.. అందుకే ఆయన చిత్రాల్లో హీరో సాదా సీదాగా మన మధ్య తిరిగే ఓ యువ కుడిలా కనిపిస్తాడు. అలా కనిపించేలా చేసి సినిమాలో హీరో మన మధ్యలోని వాడనే ఫీల్‌ని కలుగజేస్తాడు. ఈ చిత్రంలో మాస్‌ ఆడియెన్స్‌ని రంజింపజేసే సన్నివేశాలు ఉన్నప్పటికీ కథ డీల్‌ చేసే విషయంలో మరికొంత శ్రద్ధతీసుకుంటే బావుండేది. బ్రహ్మానందం, వేణుమాధవ్‌ల కామెడీ పెద్దగా పండలేదు. ఆలీ పాత్రని కూడా అర్థాంతరంగానే ముగించేశారనిపిస్తుంది.

avinash Perspective
నటన-: ప్రభాస్‌ నటన మాస్‌ని ఆకట్టుకునేవిధంగా సాగిపోతుంది.. ముఖ్యంగా ఫైట్స్‌లో ప్రభాస్‌ ఫెర్ఫార్మెన్స్‌ ఆయన అభిమానులని అలరిస్తుంది. ఫుల్‌ ఎనర్జిటిక్‌గా, స్టైల్‌గా నటించాడు ప్రభాస్‌. హీరోయిన్‌ కంగనారనౌత్‌ జస్ట్‌ ఓకే. సోనూసూద్‌ నటన ఆకట్టుకునేవిధంగా సాగిపోతూంది. ముకుల్‌దేవ్‌ ఈ చిత్రంలో ఓ డిఫరెంట్‌ క్యారెక్టర్‌లో కనిపిస్తాడు. మిగతా వారంతా తమ తమ పాత్రలకి న్యాయం చేకూర్చేవిధంగా నటించారు.

పాటలు-: రామజోగయ్యశాస్త్రి, విశ్వ, భాస్కరభట్ల ఈ ముగ్గురూ ఈ చిత్రానికి పాటలు వ్రాసారు. సాహిత్య పరంగా పాటలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా టైటిల్‌ సాంగ్‌ "ఏక్‌నిరంజన్‌' సాంగ్‌ మాస్‌, క్లాస్‌ అనేతేడాలేకుండా అందరికీ నచ్చుతుంది. మిగిలిన పాటలు ఫర్వాలేదు.
సంగీతం-: మణిశర్మ సంగీతం గురించి చెప్పేదేముంది.. ఈ చిత్రానికి సంగీతం ప్లస్‌ పాయింట్‌ సాంగ్స్‌ అన్నీ బాగున్నాయి.
ఫైట్స్‌-: స్టన్‌ శివ రూపొందించిన ఫైట్స్‌ బావున్నాయి.
ఫోటోగ్రఫీ-: చాలా చక్కగా ఉంది. ముఖ్యంగా పాటల చిత్రీకరణ బావుంది.
కొరియోగ్రఫీ-: రాజుసుందరం కంపోజ్‌ చేసిన కొరియోగ్రఫీ ఆకట్టుకుంటుంది. మ్యూజిక్‌కి అనుగునంగా సింపుల్‌ స్టెప్స్‌తో ఆకట్టుకునే రీతిలో కొరియోగ్రఫీ డిజైన్‌ చేయడం బావుంది.
హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో కాకుండా ప్రభాస్‌ యాక్షన్‌ కోసం ఈ చిత్రం చూడొచ్చు.







Movie Name బంపర్ ఆఫర్ avinash meda : 3.5/5
Banner వైష్ణో అకాడమీ
Producer పూరీ జగన్నాథ్

Director జయ రవీంద్ర

Music కుంచె రఘు
Photography శ్రీరామ్

Story పూరీ జగన్నాథ్
Dialouge పూరీ జగన్నాథ్

Lyrics భాస్కర భట్ల రవికుమార్

Editing యమ్.ఆర్.వర్మ

Art చిన్న

Choreography దినేష్, శోభ

Action రామ్-లక్ష్మణ్‍

Star Cast సాయిరాం శంకర్ , బిందుమాధవి,
షాయాజీ షిండే, చంద్రమోహన్,
ఆలీ, వేణుమాధవ్, యమ్.యస్.
నారాయణ, రక్ష, కోవై సరళ,
సుప్రీత్ తదితరులు....


avinash media Rating
2/5
Release Date
23-10-2009
Story
సాయి (సాయిరాం శంకర్) ఒక మెకానిక్. బాగా డబ్బుందన్న అహంకారంతో ఉండే కుటుంబం నుండి వచ్చిన ఐశ్వర్య అనే అమ్మాయితో అతనికి చిన్న గొడవ జరుగుతుంది. దానికి అపార్థం చేసుకున్న ఆ అమ్మాయి రౌడీలతో సాయిని కొట్టిస్తుంది. కానీ తర్వాత తన తప్పు తెలుసుకుని సాయితో ప్రేమలో పడుతుంది. కానీ ఐశ్వర్య తండ్రి ధనవంతుడైన వ్యాపారవేత్త అయిన సూర్యప్రకాశరావు వీరి పెళ్ళికి అంగీకరించడు. అందుకని సాయికి ఒక బంపర్ ఆఫర్ ఇస్తాడు.
అదేంటంటే తన ఆస్తిలో కనీసం పదిశాతం అన్నా సాయి సంపాదిస్తే అతనికి తన కూతుర్నిచ్చి పెళ్ళిచేస్తానంటాడు. కానీ ఈ బంపర్ ఆఫర్ ని సాయి అంగీకరించకుండా, సూర్యప్రకాశరావునే తన స్థాయికి దించి, అప్పుడే అతని కూతుర్ని పెళ్ళిచేసుకుంటానని తానే ఎదురు ఒక ఛాలెంజ్‍ చేస్తాడు. మరి ఒక మెకానిక్ అయిన సాయి కోటీశ్వరుణ్ణి ఎలా తన స్థాయికి తీసుకొచ్చి అతని కూతుర్ని పెళ్ళిచేసుకున్నాడు...? ఎలా తన ప్రియురాలిని దక్కించుకున్నాడు అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
Analysis

గతంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన "ఛాలెంజ్" సినిమా కథలోని మెయిన్ పాయింట్‍ని కొద్దిగా మార్చి ఈ కథను తయారు చేశారు ఈ చిత్ర నిర్మాత అయిన పూరీ జగన్నాథ్. ఈ సినిమాకి మాటలు కూడా తన స్టైల్లో ఆయనే వ్రాశారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన జయరవీంద్ర ఆయన శిష్యుడే కావటంతో ఈ సినిమా పోకడ కథ, కథనం కూడా ఆయన పద్ధతిలోనే మనకు కనపడుతుంది. దర్శకుడు జయ రవీంద్రకు చక్కని భవిష్యత్తుంది. అతని స్క్రీన్ ప్లే ఆ విషయాన్ని చెపుతుంది. అతను కూడా ఈ సినిమాని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేశాడు. దర్శకుడిగా అతనిది తొలి చిత్రమైనా ఆ తడబాటు మనకు సినిమాలో ఎక్కడా కనపడదు. బాగా అనుభవమున్న దర్శకుడిలాగే ఈ చిత్రాన్ని తీశాడు జయరవీంద్ర. ఇక నిర్మాణపు విలువలు కూడా అవసరమైన మేరకు బాగానే ఉన్నాయి.
avinash's Perspective
నటన-: ఇక నటన విషయానికొస్తే హీరో సాయిరాం శంకర్ హీరోగా చక్కని నటన కనబరిచాడు. పాటల్లో, ఫైట్స్ లో అతని ప్రతిభ మనకు కనబడుతుంది. కాకపోతే సాయి పాత్రలో "ఇడియట్‍" చిత్రంలో రవితేజ పోలికలు కనబడతాయి. అందుకు ఈ చిత్రానికి కథ తయారుచేసి, మాటలు వ్రాసిన నిర్మాత పూరీ జగన్నాథ్ కారణమనుకోవాలి. హీరోయిన్ బిందుమాధవి "ఆవకాయ్ బిర్యానీ" చిత్రం కంటే ఈ చిత్రంలో నటనలో మరింత పరిణితి కనపరచింది. తన పాత్రకు పూర్తి స్థాయిలో ఆమె న్యాయం చేసింది. ఆలీ, వేణు మాధవ్ ల "మగధీర"ను పేరడీ చేసిన కామెడీ మనల్ని హాయిగా నవ్విస్తుంది. షాయాజీ షిండే, చంద్రమోహన్, రక్ష, కోవై సరళ తదితరులు తమ తమ పాత్రలకు తగిన న్యాయం చేశారు.
సంగీతం-: గాయకుడైన రఘు కుంచె ఈ చిత్రంతో తొలిసారిగా సంగీత దర్శకుడిగా కూడా మారాడు. ఈ చిత్రం ఆడియో ఈ చిత్రం విడుదలకు ముందే సూపర్ హిట్టయ్యింది. ఈ చిత్రంలోని అన్ని పాటలూ బాగున్నా , ముఖ్యంగా "ఎందుకే రమణమ్మా" అనే పాట, "మైకం కమ్మేసినాదిరో" పాటలు మాస్ కి బాగా నచ్చుతాయి. రీ-రికార్డింగ్ కూడా సందర్భోచితంగా ఉండి బాగుంది.
పాటలు-: ఈ సినిమాలోని పాటలన్నీ భాస్కరభట్ల రవికుమార్ వ్రాశారు. ఇతనికి పూరీ జగన్నాథ్ అంటే ప్రత్యేకమైన అభిమానం. ఆయన ప్రతి సినిమాలో ఇతను కనీసం ఒక పాటైనా రాస్తూంటాడు. ఈ సినిమాలో సింగిల్‍ కార్డు ద్వారా అన్ని పాటలూ తానే వ్రాశారు. అన్ని పాటల్లోనూ సాహిత్యం బాగున్నా ఆర్థిక మాంద్యం మీద వ్రాసిన "ఎందుకే రమణమ్మా.. పెళ్ళెందుకే రమణమ్మా" పాట పబ్లిక్ కి మరింత బాగా నచ్చుతుంది.
సినిమాటోగ్రఫీ-: బాగుంది. సినిమాని నీట్ గా ఏ గందరగోళం లేకుండా చక్కగా నయనానందకరంగా మలచాడు ఈ చిత్ర కెమేరామెన్. ముఖ్యంగా పాటల్లో, యాక్షన్ సీన్లలో కెమేరా పనితనం బాగుంది.
ఎడిటింగ్-: యమ్.ఆర్.వర్మ ఎడిటింగ్ నీట్‍గా ఉంది. అనవసరమైన షాటలు గానీ, అవసరానికి మించిన షాట్‍లు కాని లేకుండా ఎడిటింగ్ బాగుంది.
కొరియోగ్రఫీ-: అన్ని పాటల్లోనూ కొరియోగ్రఫీ సందర్భోచితంగా ఉండి బాగుంది. ముఖ్యంగా "ఎందుకే రమణమ్మా"పాటలో ఇంకా బాగుంది.
యాక్షన్-: ఈ చిత్రంలోని అన్ని యాక్షన్ సీన్లూ బాగున్నాయి.



Movie Name జయీభవ avinash media Rating : 3.5/5
Banner యన్.టి.ఆర్. ఆర్ట్స్
Producer నందమూరి కళ్యాణరామ్
Director నరేన్ కొండేపాటి
Music యస్.థమన్
Photography దాశరథి శివేంద్ర
Story బి.వి.యస్.రవి
Dialouge బి.వి.యస్.రవి

Lyrics సీతారామశాస్త్రి,
రామజోగయ్య శాస్త్రి

Editing గౌతమ్ రాజు

Art రాజీవ్ నాయర్

Choreography నోబుల్‍, హరీష్ పాయ్

Action విజయ్

Star Cast నందమూరి కళ్యాణ్‍ రామ్ ‍,
హన్సిక మోత్వానీ, ఆశిష్ విద్యార్థి,
ముఖేష్ రుషి, జయప్రకాష్ రెడ్డి, ఆలీ,
బ్రహ్మానందం, రఘుబాబు, వేణు
మాధవ్, సుధ, హేమ తదితరులు...


avinash media Rating
3.5/5
Release Date
23-10-2009
Story
ముగ్గురు కార్మికులు. వారిలో భవానీ (ముఖేష్ రుషి) నరసింహ (జయప్రకాష్ రెడ్డి) ఇద్దరూ ప్రాణ స్నేహితులు. మూడోవ్యక్తి యాదగిరి {ఆశిష్ విద్యార్థి}.ఇతను ప్రాణస్నేహితులిద్దరినీ విరోధులుగా మార్చి తన పబ్బం గడుపుకుంటాడు.కాలం గడిచే సరికి మిత్రులిద్దరూ ప్రభుత్వ కాంట్రాక్టు వ్యాపారంలో పోటీపడుతూ బాగా సంపాదిస్తారు.యాదగిరి మాత్రం యాదూ మాఫియా డాన్ గా మారి క్రికెట్‍ బెట్టింగులపై హాంకాంగ్ లో కోట్లు గడిస్తూంటాడు.

భవానీ కొడుకు (నందమూరి కళ్యాణ్‍ రామ్) హాంకాంగ్ కి వెళ్ళి అక్కడ ఫ్యాషన్ డిజైనింగ్ చదువుతున్న నరసింహ కూతురు అంజలి(హన్సిక మోత్వానీ)ని ప్రేమిస్తాడు.నిజానికి అతను యాదూని కలసి అతను క్రికెటర్లను కొని చేసే, ఈ క్రికేట్ బెట్టింగ్ వ్యాపారాన్ని దెబ్బకొట్టి అతన్ని జైల్లో పెట్టించటానికే హాంకాంగ్ కి వస్తాడు.అనుకున్న పని అనుకున్నట్టుగా చేసి ఇండియాకి తిరిగొస్తాడు భవానీ కొడుకు.భవానీ కొడుకు బద్ధవిరోధులుగా మారిన ప్రాణస్నేహితులను కలిపి ఎలా తన ప్రియురాలిని దక్కించుకున్నాడు అనేది మిగిలిన కథ.
Analysis
రొటీన్ కథలకు భిన్నంగా ఒక కొత్త తరహా కథను తీసుకుని పాత తరహా కథనంతో టేకింగ్ పరంగా కొత్తగా ఈ చిత్రాన్ని చూపించారు.ఈ చిత్రం తొలి సగమంతా ఆడుతూ పాడుతు గడిచిపోతుంటుంది.నిజానికి అసలు కథ ప్రారంభమయ్యేది సెకండ్ హాఫ్ లోనే.ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన దర్శకుడు నరేన్ కొండేపాటి కొత్తవాడైనా చక్కని స్క్రీన్ ప్లేతో, సుత్తిలేకుండా సినిమాని ఆద్యంతం ఆసక్తికరంగా మలిచాడు.

సినిమా అంతా రిచ్‌గా, కలర్ ఫుల్ గా మలిచాడు.తొలి చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న తడబాటు సినిమాలో ఎక్కడా కనబడకుండా దర్శకత్వం వహించాడు.సినిమాని హాఫ్ వే లో ప్రారంభించి చక్కని సస్పెన్స్ మెయిన్ టైన్ చేశాడు దర్శకుడు. కామెడీకి కొదువ లేకుండా ఆలీ, బ్రహ్మానందం, రఘుబాబు చక్కగా నవ్వించారు.ఇక సినిమాలో నిర్మాణపు విలువలు బాగున్నాయి.
avinash's Perspective
ఇక నటన విషయానికొస్తే... హీరో నందమురి కళ్యాణ్‍ రామ్ హీరోగా చక్కని నటన కనబరిచాడు.పాటల్లో, ఫైట్స్ లో ఆయన చక్కని ప్రతిభ కనబరిచారు.హీరోయిన్ హన్సిక మోత్వానీ తన అందంతో ఈ చిత్రంలో ప్రేక్షకులకు కావలిసినంత గ్లామర్ వొలకబోసింది.ఆలీ, బ్రహ్మానందం, వేణు మాధవ్, రఘుబాబుల కామెడీ మనల్ని హాయిగా నవ్విస్తుంది.ఆశిష్ విద్యార్థి, ముఖేష్ రుషి, జయప్రకాష్ రెడ్డి తమ తమ పాత్రలకు పూర్తి స్థాయిలో న్యాయం చేశారు.


సంగీతం-:ప్రస్తుతం పూర్తి స్థాయిలో వరుస హిట్లతో విజృంభిస్తున్న థమన్.యస్.ఈ చిత్రానికి కూడ చక్కని సంగీతాన్నందించారు. అన్ని పాటలు బాగున్నాయి."వేర్ ఎవర్ యూ గో నీతో వస్తా" అనే పాట మరీ బాగుంది.వినటానికి.. చూసేందుకు కూడా.రీ-రికార్డింగ్ కూడా చక్కగా ఉంది.
సినిమాటోగ్రఫీ-:బాగుంది.సినిమాని నీట్ గా విజువల్ ఫీస్ట్ లా మలిచాడు ఈ చిత్ర కెమేరామెన్.ముఖ్యంగా పాటల్లో, యాక్షన్ సీన్లలో కేమేరా పనితనం బాగుంది.
ఎడిటింగ్-:వందల చిత్రాలకు ఎడిటర్ గా పనిచేసి, ఓ పాతిక నందుల దాకా సంపాదించిన గౌతమ్ రాజు దీనికి ఏడిటర్.ఎడిటింగ్ బాగుంది.
కొరియోగ్రఫీ-: అన్ని పాటల్లోనూ కొరియోగ్రఫీ సందర్భోచితంగా ఉండి బాగుంది.
యాక్షన్-: ఈ చిత్రంలోని అన్ని యాక్షన్ సీన్లూ బాగున్నాయి.

ఓ రెండు గంటలపాటు సరదాగా సకుటుంబంగా ఎంజాయ్ చేయాలనుకుంటే హాయిగా ఈ సినిమా చూడండి.