Village lo Vinayakudu

విలేజ్‌లో వినాయకుడు
Rating : 3/5


Banner మూన్ వాటర్ పిక్చర్స్
Producer మహి
Director సాయికిరణ్ అడివి
Music మణికాంత్ ఖాద్రి
Photography రామ్స్
Story మహి
Dialouge మహి, సాయికిరణ్ అడివి

Lyrics వనమాలి

Editing మార్తాండ్ కె వెంకటేష్

Art

Choreography

Action

Star Cast కృష్ణుడు, శరణ్యమోహన్‌, రావు రమేష్‌,
యండమూరి వీరేంధ్రనాథ్‌,
జోగినాయుడు తదితరులు..


Rating
3/5
Release Date
05.11.2009
Story
కార్తీక్‌ (కృష్ణుడు) హైదరాబాద్‌లో చిన్నపిల్లలకి ట్యూషన్‌ చెప్పే టీచర్‌. కావ్య (శరణ్య మోహన్‌) డాక్టర్‌ ప్రాక్టీస్‌ చేస్తుంటుంది. కార్తిక్‌, కావ్యలు ప్రేమించుకుంటారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటారు. విలేజ్‌లో ఉండే తన తండ్రి కల్నల్‌ లక్ష్మీపతి (రావు రమేష్‌) తమ పెళ్లికి ఓప్పుకుంటాడో లేదో అనే బెంగ పట్టుకుంటుంది కావ్యకి. కార్తిక్‌ తమ పెళ్లి గురించి లక్ష్మీపతికి చెప్పేమని ఒత్తిడి చేస్తుంటాడు. ఈ సమయంలో కావ్య, కార్తిక్‌ విలేజ్‌కి వెళుతారు.



కార్తీక్‌ని కావ్య ప్రేమిస్తుందన్న సంగతి లక్ష్మీపతి తెలుసుకుంటాడు. బండగా ఉన్న కార్తీక్‌ నుండి కావ్యని వేరుచేయాలనే ప్రయత్నాలు ప్రారంభిస్తారు. వీరిద్దరినీ విడదీయడానికి లక్ష్మీపతి స్నేహితుడు భాస్కరం (యండమూరి వీరేంధ్రనాధ్‌) స్కెచ్‌లు వేస్తుంటాడు. లక్ష్మీపతి, భాస్కరం కలిసి కార్తిక్‌ని కావ్యకి దూరం చేశారా లేదా అన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
Analysis
గతంలో వచ్చిన "వినాయకుడు ' చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ఈ విలేజ్‌లో వినాయకుడిని అందంగా తీర్చిదిద్దడంలో దర్శకుడు సాయికుమార్‌ అడివి సక్సెస్‌ అయ్యారు. ముఖ్యంగా గోదావరి పరిసరాల అందాలను తెరనిండా పొందుపరచడంలో కృతకృత్యులయ్యారు. అయితే ఫస్టాఫ్‌లో కామెడీ పండించి, సెకండాఫ్‌లో ఆడియన్స్‌ కాస్తంత బోర్‌ ఫీలయ్యేలా చేసారు. స్ర్కీన్‌ప్లే పరంగా మరికొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే బావుండేదనిపించింది. మొత్తానికి చాలా చక్కగా, నీట్‌గా, సినిమాని ప్రజెంట్‌ చేయడంలో దర్శకుడు సఫలమయ్యారు. మామూలుగా చికెన్‌ కర్రీ, చికెన్‌ ఫ్రై, చికెన్‌ సిక్స్‌టీఫై ఇలా ఎన్నోరకాల చికెన్‌ రెసిపీలని మనం చూసాం కానీ ఈ సినిమా చూసాక చికెన్‌లో మరో కొత్త రిసిపీస్‌ గురించి తెలుస్తుంది.. దాని పేరు 'బొంగులో చికెన్‌' ఈ సినిమా చూసినవారందరికీ ఆ "బొంగులో చికెన్‌' ఎప్పటికీ గుర్తుండిపోతుంది..



Perspective
నటన-: కృష్ణుడు చాలా చక్కగా నటించాడు. అతని బాడీ లాంగ్వేజ్‌, డైలాగ్‌ చెప్పే విధానం, మొహంలో అమాయకత్వం ఉట్టిపడేలా చూపించిన ఎక్స్‌ప్రెషన్స్‌ కార్తీక్‌ పాత్రకి నిండుతనాన్ని తెచ్చాయి. కావ్య పాత్రలో శరణ్యమోహన్‌ కూడా చాలా చక్కగా చేశాయి. సినిమాలో ఓ క్యారెక్టర్‌ చెప్పినట్టు కృష్ణుడు సరసన శరణ్య ఏనుగుపిల్ల ప్రక్కన ఎలుకపిల్లలాగే కనిపించినా.. కథకి తగ్గట్టుగా వారిద్దరి పాత్రలు చాలా చక్కగా కుదిరాయి. ఎక్స్‌ప్రెషన్స్‌ పరంగా శరణ్య నటన బావుంది. రావు రమేష్‌ హీరోయిన్‌ తండ్రి పాత్రలో ఒదిగిపోయారు. అప్పుడప్పుడు ఆయన నటనని చూస్తుంటే ప్రకాష్‌రాజ్‌ గుర్తుకి వస్తాడు. గమ్యం తరువాత ఈ సినిమాలో మరో చక్కని పాత్రలో రావు రమేష్‌ కనిపిస్తారు. ఇక ఫజిల్‌ భాస్కరంగా యండమూరి వీరేంద్రనాథ్‌ నటన బావుంది. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా యండమూరి చాలా చక్కగా సరిపోయారు. కార్తిక్‌ని లక్ష్మీపతి ఇంట్లోనుండి వెళ్లగొట్టటానికి ఆయన వేసే ఎత్తుగడలు నవ్విస్తాయి. మిగతా క్యారెక్టర్లు కూడా వారి పాత్రలకి తగ్గట్టుగానే ఉన్నాయి.
సినిమాటోగ్రఫి-: ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రఫీ గురించే. గోదావరి అందాలని కథలో భాగంగా ఫీలు కలిగేవిధంగా కెమెరామెన్‌ చిత్రీకరించారు. ముఖ్యంగా పాటల చిత్రీకరణ చాలా చక్కగా తీసారు. కృష్ణుడిని స్పైడర్‌మ్యాన్‌గా, బైక్‌ రైడర్‌గా ఏనిమేషన్‌లో క్రియేట్‌ చేసిన విధానం చిన్నపిల్లలని ఆకట్టుకుంటుంది.
డైలాగ్స్‌ -: మహి, సాయికుమార్‌ అడివి రాసిన డైలాగ్స్‌ బావున్నాయి.
ఎడిటింగ్‌-: చక్కగా ఉంది. ప్రతీ సీన్‌ కూడా ఎక్కువ డురేషన్‌ లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
పాటలు -: అన్ని పాటలూ బావున్నాయి.
సంగీతం -: ఓకే
కుటుంబసమేతంగా చూడదగ్గ చిత్రం ఇది.