yuganiki okkadu movie review
|
Rating | ||
3.5/5 | ||
Release Date | ||
05-02-2010 | ||
Story | ||
ఈ చిత్రం 1279 వ సంవత్సర కాలం లో జరిగిన సంఘటనలతో సినిమా మొదలవుతుంది. చోళ రాజ్యాన్ని దండయాత్ర బారి నుండి కాపాడటం కోసం చోళ రాజు తమ ప్రజలను ఓ సురక్షిత ప్రాంతానికి తరలిస్తారు... అలా రోజులు గడిచిపోతాయి... ప్రస్తుత కాలంలో ఒక అర్కియాలజిస్ట్ తన తండ్రిని వెతకడం కోసం ఓ కూలి,(కార్తీక్)ఓ ఆర్మీ ఆఫీసర్ తదితరుల సహాయంతో బయలుదేరుతారు. దారి మద్యలో 7 ప్రమాదాలను దాటుకుని చివరికి వారు శతాబ్దల క్రితం ఏర్పడిన చోళ రాజ్యన్నీ చేరుకొంటారు... వారు అక్కడకి చేరుకొన్న తర్వాత జరిగిన పరిణామాలేంటి అన్నదే మిగత కధ. | ||
Analysis | ||
"7/జి బృందావన కాలనీ, ఆడవారి మాటలకు అర్దాలే వేరులే" లాంటి సున్నితమైన కధాంశాలని తెరకెక్కించిన దర్శకుడు సెల్వ రాఘవనేన ఈ సినిమాని తెరకెక్కించింది అన్న ఆశ్చర్యం కలుగుతుంది..ఈ చిత్రంలో ప్రతి సన్నివేషాన్ని ఆసక్తి రేపే విధంగా అద్భుతంగా మలిచారు. ముఖ్యంగా ఈ చిత్రంలో గ్రాఫిక్స్ పని తీరు బావుంది. ప్రేక్షకుల ఒళ్ళు గగుర్పొడిచే విధంగా గ్రాఫిక్స్ సన్నివేశాలు వున్నాయి. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ చిత్రనికి మారో హైలెట్. | ||
Perspective | ||
నటన-: హీరో కార్తిక్ తన మొదటి సినిమాకే అవార్డు అందుకున్నాడు. ఈ చిత్రంలో కూలీగా నటన బావుంది. రీమాసేన్ తన అందాలను ఆరబోయడమే కాకుండా హీరోతో పోటిపడి నటించింది. ఆండ్రియా నటన బావుంది. వీరి ముగ్గురి మధ్యలో సన్నివేశాలు బావున్నాయి. సంగీతం-: జి.వీ ప్రకాష్ సంగీతం ఈ చిత్రానికి మరో హైలెట్. ఈ చిత్రం సక్సెస్‌కి ఎంతో దోహద పడింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బావుంది. ఛాయా గ్రహణం-: రామ్ జీ అందించిన కెమేరా ఈ చిత్రానికి మరో హైలెట్. హెలికాప్టర్ మీద నుండి చిత్రీకరించిన సన్నివేశాలు బావున్నాయి. సాంగ్స్-: సిచ్యువేషన్ కి తగ్గట్టుగా వున్నాయి. భువనచంద్ర , అనంత శ్రీరాం లిరిక్స్ బాగున్నాయి. ఈ చిత్రం బాగుంది. ఒక్కసారి చూసిన తరవాత రెండవసారి చూడాలనిపించే చిత్రాల కోవలో కి వస్తుంది. |