http://3.bp.blogspot.com/_jU-AORtFHik/S3oQOpo8WKI/AAAAAAAAEDA/Cjqu5QzFRdQ/s400/Maro+Charitra+.jpg

in one line:మరో చరిత్ర ని మల్లి తెస్తానని చెప్పి కూని చేసి పెట్టారు

Movie Name మరోచరిత్ర
Banner శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
Producer దిల్ రాజు, శిరీష్, లక్ష్మణ్
Director రవి యాదవ్
Music మిక్కీ జె. మేయర్
Photography రవి యాదవ్
Story కె.బాలచందర్
Dialouge ఉమర్జీ అనురాధా
Lyrics
Editing మార్తాండ్ కె. వెంకటేష్
Art
Choreography రవి యాదవ్
Action
Star Cast వరుణ్ సందేశ్, అనిత,
శ్రద్దాదాస్, కోట శ్రీనివాసరావు,
ప్రతాప్ పోతన్, ఊర్వశి,
నరేష్, ఆదర్ష్... తదితరులు...
story
అమెరికా నేపథ్యంలో సాగిపోయే ఈ కథలో బాలు (వరుణ్ సందేశ్) కాలేజీ డుమ్మా కొట్టి తమ ఇంటికి వస్తాడు. దాంతో బాలు తండ్రి (ప్రతాప్) బాలుని చివాట్లు పెడతాడు. అవేమీ పట్టించుకోని బాలు తన పక్కింట్లో ఉండే స్వప్న (అనిత) ప్రేమలో పడతాడు. అయితే బాలు తండ్రికి, స్వప్న తల్లి దుర్గ (ఊర్వశి) కీ అస్సలు పడదు. బాలు, స్వప్నలు ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని తెలుసుకున్న ఇరువురి తల్లిదండ్రులు బాలు, స్వప్నలకి ఓ పరీక్ష పెడతారు. ఈ పరీక్షలో ఈ ప్రేమికులు నెగ్గారా.... లేదా... అన్నదే మిగతా కథ...
analysis
1978 వ సంవత్సరంలో వచ్చిన మరో చరిత్ర సినిమాని రీమేక్ చేయాలనే ఆలోచన వచ్చినందుకు ముందుగా దర్శక నిర్మాతలను అభినందించాల్సిందే. కానీ ఓ అజరామరమయిన ప్రమకథని తిరిగి పునర్నిర్మింప తలపెట్టినప్పుడు సరయిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ విషయంలో దర్శకనిర్మాతలు విఫలం అయ్యారనే చెప్పాలి. నిర్మాణ పరమయిన విలువలు దిల్ రాజు టేస్ట్ కి తగ్గట్టుగానే ఉన్నప్పటికీ కథనం విషయంలో మాత్రం ఇది దిల్ రాజు నిర్మించిన చిత్రమేనా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన చిత్రాల్లో స్క్రీన్ ప్లేకి ప్రధాన స్థానం ఉంటుంది. ఈ చిత్రంలో అది లోపించింది. ఇక దర్శకుడు, ఛాయాగ్రాహకుడు అయిన రవి యాదవ్ దర్శకత్వం కంటే ఛాయాగ్రహణంలోనే ఎక్కువ ప్రతిభ కనబరిచాడు.
prospective
నటన :-
వరుణ్ సందేశ్ :- లవర్ బాయ్ పాత్రలో వరుణ్ సందేశ్ నటన బావుంది. ఇండో-అంగ్లియన్ గా కనిపించడానికి చాలా కష్టపడ్డాడనిపించింది..
అనిత :- స్వప్న పాత్రలో నటించిన హీరోయిన్ అనిత నటన యావరేజ్ గా ఉంది. స్వప్న పాత్రలో అనిత ఒదిగిపోలేదేమో అనిపిస్తుంది. ముఖ్యంగా ఆమెకి చెప్పించిన డబ్బింగ్ వాయిస్ మైనస్ పాయింట్.
శ్రద్దాదాస్ :- సంధ్య పాత్రలో నటించిన శ్రద్ధాదాస్ అ పాత్రకి న్యాయం చేసే విధంగా తన పెర్ఫార్మెన్స్ ని ప్రదర్శించింది.
ఊర్వశి :- పక్కా తెలంగాణా యాసలో మాట్లాడుతూ ఊర్వశి చేసే నటన ఆకట్టుకుంటుంది.
నరేష్ :- అమెరికా పోలీస్ గా కనిపిస్తూనే ఇండియా బ్రాహ్మణుడిగా డిఫరెంట్ క్యారెక్టర్ లో నరేష్ నటించాడు. ఆయన పాత్రకి తగ్గట్టుగా చక్కని నటన కనబరిచాడు.
ప్రతాప్ :- వరుణ్ సందేశ్ తండ్రిపాత్రలో నటించిన ప్రతాప్ నటన బావుంది.
కోట :- తన పాత్ర పరిధిలో చేసాడు.
మిగతా నటీనటులు కూడా తమ పాత్ర పరిధిమేరకు నటించారు.

టెక్నికల్ డిపార్ట్ మెంట్ :-
సంగీతం :- మిక్కీ జె మేయర్ అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్లస్ పాయింట్. అలాగే థమన్ ఎస్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది.
మాటలు :- ఉమర్జీ అనురాధా అందించిన మాటలు చాలా వరకు బాగున్నాయి. అందులో మచ్చుకు కొన్ని, హీరోయిన్ తల్లి హీరోయిన్ తో ''సైగలతో సరుకులను కోనేసుకోవచ్చు గాని, సంసారం చేయలేము'' హీరో తల్లి తన భర్తతో ''మీరు ఇంటలిజెంట్ కదండీ... అందుకే కన్ ఫ్యూజ్ అయ్యారు'', హీరోయిన్ హీరోతో ''నా కళ్ళకి నువ్వు కొత్త కావచ్చు కానీ నా మనసుకి నువ్వు పాతే'', ''హీరోయిన్ ఫాదర్ హీరోయిన్ తో ''దారి తప్పినా ఫర్వాలేదమ్మా... కానీ నీతి తప్పకూడదు'', అలాగే నరేష్ అనే డైలాగ్ ''అడక్కుండానే అన్నీ ఇస్తాడు దేవుడు, అలాగే చెప్పకుండానే అన్నీ తీసుకువెళ్తాడు దేవుడు'' లాంటి డైలాగులు ప్రేక్షకులని ఆకట్టుకుంటాయి.
కెమేరా :- ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ సినిమాటోగ్రఫీ. అమెరికాలో వివిధ లోకేషన్స్ ని, దుబాయ్ లోని లోకేషన్స్ ని ముఖ్యంగా నయాగరా ఫాల్స్ అందాలని అత్యద్భుతంగా తెరకెక్కించారు. ఈ చిత్రానికి ప్లస్ పాయింట్ రవి యాదవ్ అందించిన సినిమాటోగ్రఫీయే.
దర్శకత్వం :- రవి యాదవ్ సినిమాటోగ్రఫీపై పెట్టిన ఇంట్రెస్ట్ స్క్రీన్ ప్లే పై పెట్టి ఉంటే ఈ చిత్రం ఖచ్చితంగా సక్సెస్ అయ్యేదేమో అనిపిస్తుంది. దర్శకత్వం బాగున్నప్పటికీ వీక్ నెరేషన్ ఈ చిత్రానికి మైనస్ పాయింట్.

అలనాటి మరో చరిత్రని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాకి వెళితే నిరాశ తప్పదు.