http://www.cineherald.com/newsimage/nt_2871_Allu-arjuns-Varudu-logo.jpg

Movie Name వరుడు
Banner యూనివర్సల్ మీడియా
Producer డి.వి.వి. దానయ్య
Director గుణశేఖర్
Music మణిశర్మ
Photography ఆర్.డి.రాజగోపాల్
Story గుణశేఖర్
Dialouge తోట ప్రసాద్

Lyrics వేటూరి

Editing ఆంథోని

Art అశోక్

Choreography

Action స్టన్ శివ

Star Cast అల్లు అర్జున్, భానుశ్రీ మెహ్రా,
ఆర్య, ఆశిష్ విద్యార్ధి, సుహాసిని,
సమీర్, నరేష్, వినయ్, నాజర్,
షాయాజీ షిండే, బ్రహ్మానందం,
ఆహుతి ప్రసాద్,
అనితా చౌదరి మరియు
ప్రత్యేక పాత్రలో సింగీతం శ్రీనివాసరావు.

story::
సందీప్ (అల్లు అర్జున్) అందరి యువకుల్లాగే ఉల్లాసంగా గడిపే వ్యక్తి. అయితే అతని పెళ్ళి విషయానికి వచ్చేసరికి తాను లవ్ మ్యారేజ్ చేసుకోనని, పెద్దలు కుదిర్చిన వివాహమే చేసుకుంటానని తన తల్లిదండ్రులకు (సుహాసిని, ఆశిష్ విద్యార్ధి)లకు చెబుతాడు. అంతేకాదు తన పెళ్ళి అయిదురోజుల పాటు రంగరంగ వైభవంగా జరపాలని చెబుతాడు. మిగతా యువకులకు భిన్నంగా పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకోవడానికి ఇష్టపడ్డ తన కొడుకు ఇష్టాన్ని కాదనకుండా మంచి సంబంధాన్ని చూస్తారు. ఎంతో వైభవంగా పెళ్ళి పనులు ఏర్పాటు చేస్తారు. అయితే తాళి కట్టే సమయంలో పెళ్ళి మండపం కూలిపోవడం, పెళ్ళి కూతురు దీప్తి (భానుశ్రీ మెహ్రా)ని ఎవరో ఎత్తుకుపోవడం జరుగుతుంది. అయితే ఆమెని పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ కలిగిన, కరుడుగట్టిన గుండా అయిన సైకో దివాకర్ (ఆర్య) ఎత్తుకెళ్ళాడని సందీప్ కనుగొంటాడు. ఇంతకీ దివాకర్ దీప్తిని ఎందుకు ఎత్తుకెళ్ళాడు, అతని బారి నుండి దీప్తిని సందీప్ ఎలా కాపాడాడు అన్నది మిగతా కథ.
analysis
అల్లు అర్జున్, గుణశేఖర్ కాంబినేషన్ అనగానే ప్రక్షకుల్లో హై ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. అంతేకాకుండా సినిమా టైటిల్ తో పాటు సినిమాలోని హీరోయిన్ ని కూడా సస్పెన్స్ లో పెట్టేసరికి సినిమాపై అంచనాలు మరింత అధికమయ్యాయి. అయితే ప్రేక్షకుల్లో క్రియేట్ అయిన అంచనాలని అందుకోవడంలో కొంచెం విఫలం అయ్యిందనే చెప్పాలి. నేటి యువత మన సంస్కృతీ సంప్రదాయాలని గౌరవించాలనే ఓ సందేశాన్ని ఈ చిత్రంలో చూపించాలనుకోవడం అభినందించదగినదే అయినప్పటికీ... ఫస్ట్ హాఫ్ లో ఒక్కసారిగా పెళ్ళి మూడ్ ని కాస్తా పక్కన పెట్టి యాక్షన్ ఎపిసోడ్స్ కి తెరలేపడంతో కన్ ఫ్యూజన్ క్రియేట్ అయిపోయేలా చేసింది. ఇక ఈ చిత్రంలో ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు నటించడం విశేషం. తమిళంలో హీరో అయిన ఆర్య ఈ చిత్రంలో విలన్ గా నటించడం మరో విశేషం. కళాతపస్వి శ్రీ కె.విశ్వనాథ్ మార్కు సినిమాలు కరువైన ఈ రోజులలో కొంతవరకు కొన్ని సీన్లలో విశ్వనాథ్ గారి బాణీ కనిపించడం కనులకు విందు కలిగించినట్లయింది. ఈ విషయమై దర్శక ప్రతిభని తప్పని సరిగా మెచ్చుకోవచ్చు.
prospective::
నటన :-
అల్లు అర్జున్ తన పాత్రని చాలా చక్కగా పోషించారు. సిక్స్ ప్యాక్ బాడీలో క్యూట్ గా కనిపించాడు. ముఖ్యంగా వరుడుగా పెళ్ళి సీన్స్ లో చక్కని ఎక్స్ ప్రెషన్స్ తో అలరించాడు. ఇక సాంగ్స్ లో డాన్స్ విషయంలో అల్లు అర్జున్ తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ తెరపై కనిపిస్తుంది. స్టంట్స్ విషయంలోనూ చాలా బాగా చేశారు.
భానుశ్రీ మెహ్రా :- ఈ చిత్రంలో విడుదల వరకు సస్పెన్స్ లో ఉంచిన హీరోయిన్ భానుశ్రీ చూడముచ్చటగా ఉంది. నటనలోనూ మంచి మార్కులే కొట్టేసింది. ఆమె ఇంట్రడక్షన్ సస్పెన్స్ లో పెట్టినప్పటికీ ప్రేక్షకుల అంచనాలకి సరిపోయే రీతిలోనే ఉంది.
ఆర్య :- విలన్ గా ఆర్య నటన చాలా బావుంది. తమిళంలో హీరో అయినప్పటికీ ఈ చిత్రంలో ఎలాంటి భేషజాలు లేకుండా ప్రతి సీన్ లోనూ చక్కని నటన కనబరిచాడు. సైకో దివాకర్ పాత్రలో అతడు చాలా చక్కగా సరిపోయాడు.
సుహాసిని :- అల్లు అర్జున్ తల్లి పాత్రలో సుహాసిని నటన ఆకట్టుకుంటుంది.
బ్రహ్మానందం :- దిలిప్ రాజా పాత్రలో బ్రహ్మానందం నవ్వులు పూయించాడు. పెళ్ళిళ్ళ పేరయ్యగా ఉన్నంత సేపు ప్రేక్షకులని నవ్వుల్లో ముంచెత్తాడు.
నాజర్ :- పోలీసాఫీసర్ పాత్రలో ఫర్వాలేదనిపించాడు.
ఆశిష్ విద్యార్థి :- నెగెటివ్ పాత్రలో కనిపించే ఆశిష్ విద్యార్థి ఈ చిత్రంలో హీరో తండ్రిగా చక్కని నటన కనబరిచాడు.
సింగితం శ్రీనివాసరావు :- గిరీశం పాత్రలో నటించిన సింగీతం నటన బావుంది.
మిగతా నటీనటులు తమ పాత్రలకి తగ్గట్టుగా నటించారు.
టెక్నికల్ డిపార్ట్ మెంట్ :-
సంగీతం :- మణిశర్మ అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్లస్ పాయింట్. 'అయిదురోజుల పెళ్ళి', 'రేలారే', ;బహుశా ఓ చంచల' పాటలు ఆకట్టుకుంటాయి.
మాటలు :- తోట ప్రసాద్ అందించిన మాటలు బావున్నాయి. 'బ్రౌజింగ్ చేసి జాబ్ సంపాదించుకున్నాను, చాటింగ్ చేసి వైఫ్ ని సంపాదించుకోలేనా' తదితర డైలాగ్స్ ఆకట్టుకుంటాయి.
స్టంట్ :- స్టన్ శివ అందించిన స్టంట్స్ అల్లు అర్జున్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా ఉన్నాయి.
డాన్స్ :- అమ్మ రాజశేఖర్, ప్రేమ్ రక్షిత్ తదితరులు అందించిన డాన్స్ యూత్ ని విశేషంగా ఆకట్టుకుంటాయి., అల్లు అర్జున్ సినిమా అనగానే ప్రేక్షకులు ఆయననుండి డిఫరెంట్ స్టెప్స్ ని ఎక్స్ పెక్ట్ చేస్తారు. వారి ఎక్స్ పెక్టేషన్స్ కి తగ్గట్టుగానే డాన్స్ లు ఉన్నాయి.
కెమెరా :- ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కెమెరా వర్క్, ప్రతి ఫ్రేమ్ ని ఎంతో చక్కగా తెరకెక్కించారు. ముఖ్యంగా పెళ్ళి మండపం దృశ్యాలు కన్నులపండుగగా ఉన్నాయి.
దర్శకత్వం :- గుణశేఖర్ దర్శకత్వంలో వంక పెట్టాల్సింది ఏమీ లేకపోయినప్పటికీ, ఫస్టాఫ్, సెకెండాఫ్ లలో వచ్చే కథ, కథనాలపై మరింత దృష్టి పెడితే బావుండేదనిపించింది.
అల్లు అర్జున్ నటన కోసం మరియు తెలుగు సంప్రదాయాలను తన తరువాత తరాల వారికి తెలియచేయాలనుకునే ప్రతి ఎన్నారై ఈ సినిమాని కుటుంబ సమేతంగా చూడొచ్చు.