Panchakshari

EditorialSuggestions
Can watch again -No
Good for kids - Yes
Good for dates - n0
Wait to rent it - Yes
STORY::

జనగాం లో 1985లో ఈ చిత్రం కథ మొదలవుతుంది. రాత్రి సమయంలో ఒక నిండు గర్భవతి (రజిత) నొప్పులుపడుతూంటే, ఆమె భర్తతో కలసి అక్కడి దుర్గాదేవి ఆలయంలోకి వస్తుంది. అప్పుడామెకు ఒక పండంటి ఆడపిల్ల మూలా నక్షత్రంలో జన్మిస్తుంది. ఆ పాప పుట్టిన సమయాన్ని బట్టి ఆమెకు ఆ గుడి పూజారి (సుబ్బరాయశర్మ) "పంచాక్షరి" అన్న పేరు పెడతాడు.


"పంచాక్షరి" చిన్నప్పటి నుండీ ఆ దేవాలయంలోని అమ్మవారి అంశగా ఆ ఊరి జనం భావిస్తుంటారు. బోనాల పండుగ సమయంలో అమ్మవారు "పంచాక్షరి" మీద ఆవహిస్తుంది. జరగబోయే సంగతులన్నీ ఆ ఊరిప్రజలకు తెలియజేస్తుంది. "పంచాక్షరి"కి వివాహమై ఒక పాపకూడా పుడుతుంది. ఆ దేవాలయంలో కోట్ల విలువచేసే నిధులున్నాయని పురావస్తుశాఖ అధికారి ఆ ఊరిలో ఉండే ఒక దుర్మార్గుడి (ప్రదీప్ రావత్)కి తెలుపుతాడు. ఆ నిధి సొంతం చేసుకోవాలంటే ఆ గుడిని మూసేయాలి. ముఖ్యంగా బోనాల పండుగ సమయంలో భవిష్యత్తుని తెలిపే "పంచాక్షరి"ని అంతమొందించాలి. దానికి అతనేం చేశాడు...? "పంచాక్షరి" ఏమవుతుంది...? అనేది మిగిలిన కథ.
Analysis
"అనంత విశ్వంలో ఏన్నో వింతలు" అంటూ మోహన్ బాబు గాత్రం వినిపిస్తుంటే ఈ చిత్రం మొదలవుతుంది. ఈ చిత్రాన్ని ఒక అమ్మోరు, ఒక అరుంధతి చిత్రంలా తీయటానికి దర్శకుడు చాలా శ్రమపడ్డాడు. కానీ ఆ చిత్రాల స్థాయినీ చిత్రం అందుకోలేదు. ఈ చిత్రం తొలి సగమంతా సో..సో..గా నడిచింది. సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మోదలవుతుంది. కథ అల్లిక కొంత గజిబిగాఉంది. కథనం ఆశించినట్టుగా సాగకపోవటం ఈ చిత్రానికి మైనస్ పాయింట్. జనగాంలో "పంచాక్షరి" (అనుష్క) పూజలు చేస్తూ, పూజలు అందుకుంటూంటే, అదే సమయానికి సికిందరాబాద్ బోనాల పండుగలో హనీ (అనుష్క) రికార్డింగ్ డ్యాన్సు వంటి డ్యాన్సు చేయటం చూస్తే దర్శకుడు ప్రేక్షకులకు ఏం చెప్పదలచుకున్నాడో అర్థం కాదు. అంతేకాక హనీ తండ్రి నాజర్ తన కుటుంబానికి ప్రతి ఆదివారం టిఫిన్ చేసేటప్పుడు ఎవరైనా తప్పుచేస్తే ఒప్పుకోమని అడగటం అనే ఎపిసోడ్ చాలా బోరింగ్ గా నడిచింది.

హనీ స్నేహితురాళ్ళకు అవసరానికి మించి సీనివ్వటం వల్ల సినిమాకి అది కూడా అనవసర అడ్డంకిగా మారింది.ఇక బ్రహ్మానందంతో మగధీర చిత్రం పేరడీ ఏమాత్రం ఆసక్తికరంగా లేదు సరికదా బోరింగ్ గా ఉండింది.ఇలా చెప్పుకుంటూపోతే ఈ చిత్రం చాలా సీన్ల గురించి అలా చెప్పాలి. ఇక క్లైమాక్స్ లో ఆ ఊరి ఊరినీ విలన్ చంపేస్తానంటే జనం తిరగబడే ఆలోచనే చేయరు సరికదా, అతనెప్పుడెప్పుడు తమను చంపుతాడాని ఎదురుచూస్తున్నట్లుంది. సినిమా ముగించాలి కాబట్టి ఊర్లోని ముత్తైదువులంతా తెచ్చిన పసుపు ముద్దను విలన్ తన్నబోతే అందులోంచి అమ్మవారు రావటం,పంచాక్షరి ఆత్మలోకి ప్రవేశించి, కాసేపు నాట్యం చేసి విలన్లిద్దరినీ చంపటం, ఆ తర్వాత పంచాక్షరి ఆత్మ నక్షత్రంగా మారటం సరిగ్గా పండకపోవటంతో హాస్యాస్పదంగా అనిపిస్తుంది.
Perspective
నటన -: పంచాక్షరిగా, హనీగా అనుష్క నటన బాగుంది. ఆమె ఆ రెండు పాత్రలకు సమానంగా న్యాయం చేసింది. అనుష్క తప్ప ఈ చిత్రంలో ఏ ఒక్కరూ ప్రేక్షకులను ఆకట్టుకునే స్థాయిలో నటించలేదనే చెప్పాలి. నిజానికి ఈ చిత్రాన్ని అనుష్క తన భుజాల మీద మోసిందని చెపితే బాగుంటుంది.
సంగీతం -: రీ-రికార్డింగ్ మాత్రం ఒక్కో సందర్భంలో బాగుంది.
మాటలు -: ఆశించిన స్థాయిలో ఆకట్టుకోవు.
కొరియోగ్రఫీ -: గొప్పగా ఏం లేదు.
యాక్షన్ -: యావరేజ్ స్థాయిలో ఉంది.
గ్రాఫిక్స్ -: ఫరవాలేదనిపించే స్థాయిలో ఉంది.
ఆర్ట్ -: ఈ డిపార్ట్ మెంట్ ఒకటి బాగా పనిచేసింది.

ఎవరేం చెప్పినా అమాయకంగా నమ్మే వారికీ ,ముఖ్యంగా మూఢనమ్మకాలను బాగా నమ్మే వారికి, అమాయకులకు ఈ చిత్రం నచ్చితే నచ్చవచ్చు. అనుష్క నటన కోసం ఈ చిత్రాన్ని చూడాలనిపిస్తే చూడొచ్చు.