http://www.yahoomelody.com/wp-content/uploads/2010/04/awara-telugu.jpg

Movie Name ఆవారా
Banner స్టూడియో గ్రీన్
Producer సుభాష్ చంద్ర బోస్
Director ఎన్. లింగుస్వామి
Music యువన్ శంకర్ రాజ
Photography మది
Story ఎన్. లింగుస్వామి
Dialouge శశాంక్ వెన్నెలకంటి

Lyrics భువనచంద్ర, చంద్రబోస్,
వెన్నెలకంటి

Editing ఆంటోని

Art రాజీవన్

Choreography రాజుసుందరం

Action కనల్ కన్నన్

Star Cast కార్తీ, తమన్నా, సోనియా,
మిలింద్ సోమన్, కార్తిక్, తదితరులు..

story:

శివ (కార్తీ), ఓ ఇంటర్వ్యూ అటెండ్ అవడానికి బెంగుళూరుకి వస్తాడు. అతని ఫ్రెండ్స్ ప్రియ (సోనియా) అండ్ గ్యాంగ్ ఇంటర్వ్యూ కోసం శివని బాగా ప్రిపేర్ చేస్తారు. కాని శివ మాత్రం ఓ బస్ లో చారులత (తమన్నా) ని చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. తన వారు తనకి చేస్తున్న ఇష్టం లేని పెళ్లిని తప్పించుకోవడానికి చారులత బెంగుళూరు వస్తుంది. ఆమెని వెతుక్కుంటూ కొందరు గూండాలు కూడా వస్తారు. అనుకోకుండా శివ సహాయంతో అతని కారులో ముంబై కి వెళ్ళాల్సి వస్తుంది. శివకి అప్పటికే ముంబైలోని ఒక గూండాతో వైరం వుంటుంది. శివ కనిపిస్తే చంపేయడానికి వారు సిద్దంగా వుంటారు. ఇటు శివ ని వెతుకుతున్న గూండాలు, అటు చారులత ని వెతుకుతున్న గూండాలు వీరి బారి నుండి శివ, చారులత లు ఎలా బయటపడ్డారు, చివరికి చారులతతో శివ తన ప్రేమ విషయం చెప్పాడా లేదా అన్నది మిగితా కథ.
analysis:
తను ప్రేమించిన అమ్మాయి కోసం ఎంత రిస్క్ అయినా తీసుకోవడానికి సిద్దపడే వీరోచిత హీరోల కథలతో ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమాతో లింగుస్వామి కొత్తగా చెప్పింది ఏమిటో అర్థం కాలేదు. లవ్, యాక్షన్ ని మిళితం చేసి సినిమా తీయాలంటే ముందు కథలో దమ్ము వుండాలి. ఈ సినిమాలో అది లోపించింది. ఫస్ట్ హాఫ్ అంతా కారు ప్రయాణం తోనే సాగుతుంది. ఇంత లాంగ్ జర్నీని ప్రేక్షకులు ఎలా భరిస్తారని అనుకున్నాడో ఏమిటో... సెకండ్ హాఫ్ లో హీరో వీరోచిత ఫైటింగ్స్ తో నింపేసాడు. ఇది మాస్ ప్రేక్షకులని మెప్పించవచ్చు. పందెం కోడి లాంటి బ్లాక్ బస్టర్ మూవీ ఇచ్చిన లింగుస్వామి ఈ చిత్ర విషయంలో ప్రేక్షకులని నిరుత్సాహానికి గురిచేశాడు.
prospective::

కార్తీ నటన ఈ చిత్రానికి హైలెట్ గా నిలుస్తుంది. ఎక్స్ ప్రెషన్స్ పలికించిన విధానం బావుంది. యాక్షన్ ఎపిసోడ్స్ లో కూడా చక్కగా నటించాడు.
తమన్నా ఈ చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణ. చాలా చక్కగా నటించింది. తన పాత్ర మేరకు చక్కని నటనని కనబరిచింది.
కార్తీ ఫ్రెండ్ గా సోనియా నటన ఫర్వాలేదు.
యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం ఈ చిత్రానికి మరో ప్లస్ పాయింట్. సాంగ్స్ బాగున్నాయి.
చంద్రబోస్, వెన్నెలకంటి, భువనచంద్రలు అందించిన సాహిత్యం బావుంది.
కెమరామెన్ మది కెమెరా పనితనం చాలా బావుంది. కార్ చేజింగ్ సన్నివేశాలని అద్భుతంగా తెరకెక్కించాడు.
యాక్షన్ ఎపిసోడ్స్ ఈ చిత్రానికి మరో ఆకర్షణ. వళ్ళు గగుర్పొడిచే విధంగా స్టంట్ లని తెరకెక్కించారు.
శశాంక్ వెన్నెలకంటి మాటలు ఫర్వాలేదు.
లవ్, యాక్షన్ ని మిళితం చేసి రూపొందించిన ఈ చిత్రంలో దర్శకుడు లింగుస్వామి యాక్షన్ పైనే ఎక్కువ దృష్టి పెట్టడం తో లవ్ అంతగా పండలేదు.

యాక్షన్ ని ఇష్టపడేవారు ఈ చిత్రాన్ని చూడొచ్చు.