story::
సుబ్బు (ఆదిత్య బాబు) ఉల్లాసంగా ఉండే యువకుడు. ఎవరైనా తప్పు చేస్తీ వెనుకా ముందు చూడకుండా ఉతికి ఆరేస్తాడు. ఆ కారణంగానే అతనికి ఏ కాలేజి లోను సీట్ ఇవ్వరు. చివరికి ఒక వుమెన్స్ కాలేజ్ లో సీట్ సంపాదిస్తాడు. అదే కాలేజ్ లో చదువుతున్న సుబ్బలక్ష్మి (రోమ) తో ప్రేమలో పడతాడు. అయితే వారిద్దరూ తమలోని ప్రేమని బయటికి చెప్పుకోరు. సుబ్బలక్ష్మి కి ఆమె తండ్రి మరో సంబంధం ఖాయం చేస్తాడు. చివరికి సుబ్బు, సుబ్బలక్ష్మి ఎలా ఒకటయ్యారు.. వారిద్దరూ ఒకటి కావడానికి సుబ్బు ఎన్ని తంటాలు పడ్డాడు అన్నది మిగతా కథ.
analysis::
ఒక వుమెన్స్ కాలేజి లో ఓ అబ్బాయికి సీటు ఇవ్వడం, అది కూడా ఆ అబ్బాయి అల్లరి చిల్లరగా తిరిగేవాడని తెలిసికూడా సీటివ్వడం చాలా ఫన్నీగా వుంది. పైగా లేడీ స్టూడెంట్స్ ఆ అబ్బాయిని ర్యాగింగ్ చేయడం లాంటి సీన్లు దర్శక నిర్మాతలకి తెగ నచ్చి ఉంటాయేమో కాని చూసే ప్రేక్షకుడికి మాత్రం ఏవగింపు కలిగిస్తాయి. హీరో అనేవాడు జల్సాగా మందు త్రాగడం, పోలీసు స్టేషన్లో తన్నులు తినడం, తండ్రితో కూడా పీకలదాకా మందుకొట్టి డ్యాన్సులు చేయడం లాంటి పనులు చేయాలి అన్నట్టుగా సీన్లు క్రియేట్ చేస్తున్న దర్శకులు ఆ సన్నివేశాలు యూత్ పై చెడు ప్రభావాన్ని చూపిస్తాయని తెలుసుకొంటే బావుంటుంది.
ఈ సినిమాలో హీరోని ఓ పెగ్గు తాగుతావా అని ఆఫర్ చేస్తే.. లేదండి క్వాటర్ తాగుతాను అని అంటాడు.. చివరికి క్లైమాక్స్ సీన్లో కూడా హీరో ఫుల్లుగా మందు కొట్టి ఉంటాడు. ఇటువంటి సన్నివేశాలు చాలా తక్కువగా ఉండేలా చూసుకుంటే బావుంటుంది. ఇక బ్రహ్మానందం పాత్ర ఎందుకు పెట్టారో అర్థం కాదు. అంత పెద్ద హాస్య నటుడిని పెట్టుకుని ఏమి ఉపయోగం లేదు. టెక్నికల్ గా బాగానే ఉన్నప్పటికీ అసలు కథే బలహీనంగావుండడం ఈ చిత్రం మైనస్ పాయింటు.
ఆదిత్యబాబు పాత్ర పరంగా బాగానే చేసాడు. ఎక్స్ ప్రెషన్స్ విషయంలో మరికొంత జాగ్రత్త తీసుకుంటే బావుంటుంది. రోమా హీరోయిన్ గా సూట్ కాలేదు. ఆమె నటన కూడా ఓవర్ గా వుంది. వెన్నెల కిషోర్, సుమన్ శెట్టి లు నవ్వించడానికి ప్రయత్నించారు. రావు రమేష్, చంద్ర మోహన్, ప్రగతి తదితరులు తమ పాత్రలకి తగ్గట్టుగా చేసారు.
సంగీతం : ఈ చిత్రానికి ప్లస్ పాయింట్. అన్ని పాటలు అలరిస్తాయి.
ఫైట్స్ ఓకే.
గంగోత్రి విశ్వనాధ్ మాటలు.. చాలా వరకు ద్వందార్థాలు వినిపించేలా వున్నాయి.
టైటిల్ లో వున్న చలాకి ని సినిమాలో చూపించలేక పోయారు.