
live and exclusive from AGS గోల్డ్ CINEMAS చెన్నై

ఎ సెంటర్ లో ఎలా ?
A -CNTER : hit
B-CENTER : above avg
C -CENTER: hit
ఒక లైన్ లో సూటిగా చెప్పాలంటే ::"బృందావనం" పేరుకి క్లాస్ చిత్రమే అయినా,ఇది అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ తో కూడిన మాస్ మూవీ.ఈ సినిమాని మీరు ధైర్యంగానే చూడవచ్చు.
rating   :: 3.5/5
  user   rating : 4/5
  (sms ur rating  as movie   name (space )  rating to  9848117007)
story ::
కోట శ్రీనివాసరావుకి రెండు పెళ్ళిళ్ళు.పెద్ద భార్య కొడుకు భానుప్రసాద్(ప్రకాష్ రాజ్)..చిన్నభార్య కొడుకు శివ(శ్రీహరి).వీళ్ళిద్దరూ చేరొక ఊర్లో ఉంటారు.వీళ్ళిద్దరి పగ కారణంగా ఆ రెండు ఊర్ల ప్రజలకూ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది.భానుప్రసాద్ కూతురు భూమి (కాజల్ అగర్వాల్),శివ భార్య (సితార) అక్క కూతురు సమంత. సమంత,కృష్ణ (యన్ టి ఆర్) ప్రేమించుకుంటారు.భూమికి ఆమె బావ(అజయ్)తో పెళ్ళిచేయ్యాలని భానుప్రసాద్ అనుకుంటాడు.ఆ వివాహం ఇష్టం లేని భూమి,ఆమె తాత కలసి ఒక నాటకమాడతారు.భూమి ఎవర్నో ప్రేమించిందని భానుప్రసాద్ కి చెపుతారు.అతన్ని ఇంటికి తీసుకురమ్మంటాడు భాను ప్రసాద్.సమంత,భూమి స్నేహితులవటం వల్ల,కృష్ణని భూమితో పాటు ఆమె ప్రేమికుడిగా వెళ్ళమంటూంది సమంత.అలా వెళ్ళిన కృష్ణ పగతో రగిలే అన్నదమ్ముల్ని,ఆ రెండు గ్రామాలనూ కలుపుతాడు.అలాగే భూమి మనసు కూడా దోచుకుంటాడు.ఆ తర్వాత ఏమయిందనేది మిగిలిన కథ.

analysis ::
దర్శకత్వం - "మున్నా" చిత్రానికి దర్శకత్వం వహించిన వంశీ పైడిపల్లి ఈ సారి పక్కా కమర్షియల్ ఫార్ములాతో "బృందావనం" చిత్రానికి దర్శకత్వం వహించాడు.దర్శకుడిగా వంశి ఈ సినిమాకి ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాడు.
కానీ అన్నదమ్ముల మధ్య గొడవ వచ్చిందని చెప్పాడే కానీ అది ఎందుకొచ్చిందో అనే విషయానికి క్లారిటీ లేదు.అయినా అదేం పెద్ద పట్టించుకోవలసిన సంగతి కాదు.స్క్రీన్ ప్లే బాగుంది.సినిమా ఫస్టాఫ్ కాస్త స్లో అనిపించినా,సెకండ్ హాఫ్ బాగుంది.గతంలో "నారి నారి నడుమ మురారీ", "బావగారూ బాగున్నారా"చిత్రాలను ఈ చిత్రానికి స్ఫుర్తిగా తీసుకున్నారని చెప్పవచ్చు.
నటన - ఇక యన్ టి ఆర్ నటన గురించి కొత్తగా చెప్పాల్సిందేం లేదు.సరైన పాత్ర దొరికితే దుమ్ము లేపే దమ్మున్న నటుడతను.
ఈ సినిమాలో తన పాత్రలో,నటనలో కొత్తదనం చూపించే ప్రయత్నం చేశాడు.ఇక ఫైట్స్ ,డ్యాన్సూ సరేసరి...యన్ టి ఆర్ కి వాటి విషయంలో వంకపెట్టగలమా...?ఈ సినిమాకి కాజల్ అగర్వాల్, సమంత ఇద్దరూ కావలసినంత గ్లామర్ యాడ్ చేశారు.ఇక ప్రకాష్
రాజ్, శ్రీహరి, కోట ఇలా అంతా తమ తమ పాత్రలకు న్యాయం చేయగా,బ్రహ్మానందం,వేణు మాధవ్ ఈ చిత్రంలోని కామెడీని తలకెత్తుకున్నారు.బాగుంది.
సంగీతం - ప్రస్తుతం మన టాలీవుడ్ లోతమన్ హవా నడుస్తూంది.అతనందించిన సంగీతం అద్భుతంగా లేక పోయినా,ఫరవాలేదనిపించే స్థాయిలోనే ఉంది.రీ-రికార్డింగ్ బాగుంది
సినిమాటోగ్రఫీ - చాలా బాగుంది.లైటింగ్ స్కిమ్ కానీ, కేమెరా యాంగిల్స్ కానీ బాగున్నాయి.ఈ సినిమాని కలర్ ఫుల్ గా చూపించటానికి సినిమాటోగ్రఫి బాగా ఉపయోగపడింది.నైస్ కెమెరా వర్క్.
ఎడిటింగ్ - చాలా బాగుంది.
మాటలు - చాలా బాగా లేకున్నా సందర్భోచితంగా ఫరవాలేదనిపించేలా ఉన్నాయి.
పాటలు - సాహిత్యపరంగా ఒ.కె.
ఆర్ట్ - బాగుంది.
కొరియో గ్రఫీ - సగటు స్థాయిలోనే ఉంది.
యాక్షన్ - మాస్ కి ఏమేం కావాలో అవన్నీ ఈ సినిమా యాక్షన్ సీన్లలో ఉన్నాయి.

final point ::
"బృందావనం" పేరుకి క్లాస్ చిత్రమే అయినా,ఇది అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ తో కూడిన మాస్ మూవీ.ఈ సినిమాని మీరు ధైర్యంగానే చూడవచ్చు.
 






