raktha charitra 1 review::

http://sphotos.ak.fbcdn.net/hphotos-ak-snc4/hs013.snc4/34035_130865590281211_116194468414990_195666_5303491_n.jpg
live and exclusive from AGS గోల్డ్ CINEMAS చెన్నై

సెంటర్ లో ఎలా ?
A -CNTER :
avg

B-CENTER : above avg

C -CENTER: hit

ఒక లైన్ లో సూటిగా చెప్పాలంటే ::మీకు వైలెన్సంటే ఇష్టమైతే ఈ సినిమా నిరభ్యంతరంగా చూడండి.ఇది రొటీన్ కు భిన్నంగా సాగే ఒక విభిన్నమైన కథా చిత్రం.కాకపోతే కాస్త హింస ఎక్కువ పాళ్ళల్లో ఉంది...కనుక ఆడవాళ్ళు,పిల్లలు ఈ సినిమా చూడటం కొంచెం కష్టం....అంతే...
rating :: 3/5

user rating : 3/5
(sms ur rating as movie name (space ) rating to 9848117007)



story ::
ఇది రాయలసీమలోని పరిటాల రవి, మద్దుల చెరువు సూరిల మధ్య జరిగిన ఫ్యాక్షన్ గొడవల ఆధారంగా ఈ చిత్రం కథని తయారు చేసుకున్నానని వర్మ ముందే ఈ చిత్రం కథ ఎలా ఉందబోతోందో హింట్‍ ఇచ్చాడు. అలాగే ఈ కథ జరిగినప్పుడు ఉన్న ముఖ్యమంత్రి యన్ టి ఆర్,మొద్దు శీను,ఓబుల్‍ రెడ్డి ఇలా చాలా మందిని ఈ కథలోని పాత్రలు మనకు అనుకోకుండానే గుర్తుకు తెస్తాయి. కథలోకి వెళ్తే వర్మ వాయిస్ ఓవర్‍ తో ఈ చిత్రం ప్రారంభమవుతుంది.ఆనందపురంలో యమ్.యల్.ఎ.నరసింహా రెడ్డికి కుడి భుజంగా ఉంటాడు వీరభద్రయ్య.స్థానిక సంస్థల ఎన్నికల్లో వీరభద్రయ్య మనుషులకే సీట్లన్నీ ఇవ్వటం నరసింహా రెడ్డి బంధువైన నాగమణి రెడ్డికి నచ్చదు. అతను నరసింహారెడ్డికి వీరభద్రయ్య మీద లేనిపోనివి చెప్పి వీరభద్రయ్య అంటే కోపం వచ్చేలా చేస్తాడు.దాంతో నరసింహా రెడ్డికీ, వీరభద్రయ్యకీ మధ్య గొడవవుతుంది.అప్పుడు నాగమణి రెడ్డి వీరభద్రను మందా అనే అతని అనుచరుడితోనే చంపిస్తాడు. వీరభద్రయ్య పెద్ద కొడుకు శంకర్ నరసింహా రెడ్డితో అడవిలో దాగుండి గొడవపడుతూంటాడు.అతన్ని పోలీసుల సాయంతో నాగమణి చంపిస్తాడు. పట్నంలో చదువుకుంటున్న ప్రతాప్ ఈ విషయం తెలుసుకుని పోలీస్ స్టేషన్ లో గొడవ పడతాడు.అప్పటి నుంచి ప్రతాప్ టార్గెట్ నరసింహా రెడ్డి, నాగమణి రెడ్డి,నాగమణి రెడ్డి కొడుకు బుక్కారెడ్డి లను చంపటమే.ఆ ప్రయత్నంలో భాగంగా నరసింహారెడ్డిని ముందుగా చంపేస్తాడు ప్రతాప్.ఆ తర్వాత పోలీస్ వేషాలతో వచ్చి నాగమణి రెడ్డిని చంపేస్తాడు.అప్పడే పార్టీ పెట్టిన శివాజీరావు ప్రతాప్ ని తన పార్టీ తరపున యమ్.యల్.ఎ.గా నిలబెట్టి మంత్రి పదవినిస్తాడు.అతన్ని చంపాలనుకుంటున్న బుక్కారెడ్డి హైదరాబాద్ లో మసాబ్‍ టాంక్ వద్దనున్న మహేశ్వరి కాంప్లెక్స్ లో ఒక అపార్ట్ మెంట్లో ఉంటాడు.ఒకప్పుడు బాబు అనే ముస్లిం యువకుడి చెల్లిని రేప్ చేస్తాడు బుక్కారెడ్డి.ఆ బాబునే బుక్కారెడ్డిని చంపటానికి పంపిన టీమ్ కి లీడర్ గా పంపిస్తాడు ప్రతాప్.బాబు చేతిలో బుక్కారెడ్డి హతమైపోతాడు. హైదరాబాద్ లో ఉన్న గూండాలందర్నీ పిలిపించి వార్నింగిస్తాడు ప్రతాప్.వర్మ గొంతు మనకు ఈ సినిమాలో చాలా సందర్భాల్లో వినపడుతుంది.క్లామాక్స్ లో ప్రతాప్ కి మరో గట్టి వ్యక్తి తగులుతాడు అప్పుడు ప్రతాప్ భావాలెలా ఉంటాయో ఈ చిత్రం ద్వితీయ భాగంలో నవంబర్ 19 న చూడండి అంటు వర్మ గొంతు మళ్ళీ వినపడుతుంది.."రక్తచరిత్రll" ట్రైలర్లు చూపించటంతో ఈ చిత్రం ముగుస్తుంది.


analysis ::
దర్శకత్వం,నటన - ఒక దర్శకుడిగా "శివ" చిత్రంలోనే తానేంటో నిరూపించుకున్నాడు వర్మ.ప్రస్తుతం అతను ఒక దర్శకుడిగా ఈ
చిత్రానికి ఎంచుకున్న కథ,దానికి ఎలాంటి స్క్రీన్ ప్లే రాసుకున్నాడు...దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేశాడన్నదే మనం ఆలోచించాల్సింది.
వర్మకి కాంట్రోవర్సీ లంటే చాలా ఇష్టం.ఈ కథని ఎన్నుకోటానికి గల ప్రథాన కారణం అదే.ఈ సినిమాకి చక్కని స్క్రీన్ ప్లే కుదిరింది.
సినిమా తొలిసగం చాలా బాగుంది.సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా అనిపిస్తుంది.ఈ భాగంలో మద్దుల చెరువు సూరి పాత్ర ఇంకా ఎంటరవలేదు.బహుశా అది సెకండ్ పార్టులో ఉన్నట్టుంది.శివాజీ రావుగా శతృఘ్న సిన్హా నటన ఫరవాలేదు.ప్రతాప్ గా వివేక్ ఒబేరాయ్ నటన చాలా బాగుంది.కొన్ని కొన్ని ఎక్స్ ప్రెషన్లు అద్భుతంగా ఉన్నాయి.మిగిలిన వారంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.ప్రతాప్ తల్లిగా జరీనా వాహబ్ నటన ఆకట్టుకుంటుంది.
సంగీతం - మణిశర్మ సంగీతం ఈ చిత్రానికి బాగా ప్లస్సయింది.వర్మ తన ఈ చిత్రానికి ఎలాంటి సంగీతం కావాలనుకుంటాదో ఈ
చిత్రానికి దాన్నే మణిశర్మ అందించాడు.ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోరు కూడా సన్నివేశాలకు తగ్గట్టుగా ఉండి చాలా బాగుంది.

సినిమాటోగ్రఫీ - చాలా బాగుంది.కెమెరామేన్ ఈ చిత్రంలో లైటింగ్ స్కీమ్ చాలా సహజంగా ఉండేలా జాగ్రత్తపడ్డాడు.అలాగే యాక్షన్
సీన్లలో కూడా కెమెరా వర్క్ చాలా బాగుంది. కొన్ని కొన్ని షాట్స్ ఎక్స్ ట్రార్డినరీ గా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.
మాటలు - ఈ చిత్రంలోని మాటలు చాలా క్లుప్తంగా, సూటిగా ఉన్నాయి.మొత్తానికీ చిత్రంలోని మాటలు బాగున్నాయనే చెప్పాలి
పాటలు - "రక్తచరిత్ర" టైటిల్‍ సాంగ్ బాగుంది.అలాగే "మృత్యంజయ మహామంత్రం", "నాగేంద్ర హారాయ త్రిలోచనాయ" వంటివి
కూడా సందర్భోచితంగా బాగుండేలా వాడారు.
ఎడిటింగ్ - నీట్ గా, క్రిస్ప్ గా ఉండి బాగుంది.ఈ సినిమా బోర్ కొట్టకుండా ఉండటానికి ఎడిటింగ్ ఒక కారణమని చెప్పవచ్చు.
ఆర్ట్ - బాగుంది.
కొరియోగ్రఫీ - "డబ్బున్నోడా"పాటకు కొరియోగ్రఫీ సహజంగా ఉండి బాగుంది.ఈ చిత్రంలో అన్ని సినిమాల్లో ఉండేలాటి
డ్యూయెట్స్...స్టెప్పులు లేవో




final point ::
మీకు వైలెన్సంటే ఇష్టమైతే ఈ సినిమా నిరభ్యంతరంగా చూడండి.ఇది రొటీన్ కు భిన్నంగా సాగే ఒక విభిన్నమైన కథా చిత్రం.కాకపోతే కాస్త హింస ఎక్కువ పాళ్ళల్లో ఉంది...కనుక ఆడవాళ్ళు,పిల్లలు ఈ సినిమా చూడటం కొంచెం కష్టం....అంతే...