బ్యానర్: ఎన్టీఆర్ ఆర్ట్స్
తారాగణం: కళ్యాణ్ రామ్, సనాఖాన్, శరణ్య మోహన్, శ్యామ్, కోట శ్రీనివాస రావు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, బ్రహ్మానందం, వేణు మాధవ్, చంద్ర మోహన్, అజయ్
కధ: వక్కంతం వంశి
మాటలు: ఎమ్. రత్నం
సంగీతం: మణిశర్మ
సినిమాటోగ్రఫీ: సర్వేష్ మురారి
ఎడిటింగ్: గౌతమ్ రాజు
ఫైట్స్: రామ్-లక్ష్మణ్
నిర్మాత: నందమూరి కళ్యాణ్ రామ్
దర్శకత్వం: మల్లికార్జున్
అతనొక్కడే తో అనూహ్య విజయాన్ని దక్కించుకున్న నందమూరి కళ్యాణ్ రామ్ తరవాత అసాద్యుడై హరేరామ్ గా జయీభావ అంటూ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. పరాజయాలను పక్కన పెట్టి విజయం కోసం కసితో 'కళ్యాణ్ రామ్ కత్తి' గా ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కళ్యాణ్ రామ్ తన సొంత నిర్మాణ సంస్థ యన్.టి.ఆర్ ఆర్ట్స్ పతాకంఫై తన తోలిచిత్రం దర్శకుడు మల్లికార్జున్ తో 'కళ్యాణ్ రామ్ కత్తి' సినిమాని ప్రతిస్టాత్మకంగా నిర్మించాడు. సనాఖాన్ హీరోయిన్ గా పరిచయం అయిన ఈ చిత్రం లో కిక్ శ్యాం, శరణ్య మోహన్ ప్రధాన పాత్రలు పోషించారు. మణిశర్మ నేపధ్య సంగీతాన్ని అందించాడు. టైటిల్ వివాదంతోనే కావలసినంత పబ్లిసిటీ తెచ్చుకున్న కళ్యాణ్ రామ్ కత్తి పెద్దగా ప్రచారం లేక పోయినా మణిశర్మ సంగీతం, ట్రైలర్స్ తో ప్రేక్షకుల్లో కాస్తంత ఆసక్తిని రేకిత్తించింది. ఇప్పటికే రెండు హిట్ సినిమాలను ఎంజాయ్ చేసిన నందమూరి ఫాన్స్ కు కళ్యాణ్ రామ్ మరో హిట్ ఇచ్చి ఈ సంవత్సరాన్ని నందమూరి నామ సంవత్సరంగా సార్ధకం చేసాడో లేక పూర్వం లానే చతికిల పడ్డాడో ఈ సమీక్షలో చూద్దాం.
కధ:
గొప్ప ఫుట్ బాల్ ప్లేయర్ కావాలని కలలు కనే రామకృష్ణ(కళ్యాణ్ రామ్)ది, నాన్న, ఇద్దరు అన్నయ్యలు, వదినలు, వాళ్ళపిల్లలు, ఓ చెల్లి, పదేళ్ళ నుంచి పాతుకు పోయి ఉన్న పని మనిషి తో హాయిగా ఉండే కుటుంబం. అందరు ఓకే కానీ చెల్లి హారిక (శరణ్య మోహన్) వేరే తరహ, తను చేసే పోరాపాటులతో ఎప్పుడూ గొడవలు తెస్తూ ఉంటుంది వాటిని రామ కృష్ణ సర్దిచేబుతు ఉంటాడు. మరో వైపు అంజలి (సనా ఖాన్) రామకృష్ణ ను ఓ పిచ్చిగా ప్రేమిస్తూ కొన్ని రీళ్ళ తరవాత అతను ప్రేమించేటట్టు చేస్తుంది. ఇలా హ్యాపీగా సాగిపోతున్న సమయంలో ఒకరోజు హరిత కనపడకుండా పోతుంది. ఏమైందో అర్ధం కాకా రామకృష్ణ అతని కుటుంబం అయోమయంలో ఉంటారు. కొన్ని నెలల తరువాత ఒక రోజు హరిత ను కొంతమంది చంపటానికి ప్రయత్నిస్తుండగా రామకృష్ణ కాపాడతాడు. చంపటానికి ప్రయత్నించింది రాయలసీమ ఫ్యాక్షన్ నేపద్యం ఉన్న కృష్ణమోహన్ (శ్యాం) హరిత భర్త అని తెలుసుకుని, బావను మార్చి చెల్లిలి కాపురం చక్కదిద్దటానికి రాయలసీమలో అడుగు పెడతాడు రామకృష్ణ. అసలు హరిత, కృష్ణ మోహన్ పెళ్లి ఎలా జరిగింది...?. హరితను తన భర్త ఎందుకు చంపాలనుకున్నాడు...? అన్ని అడ్డంకులను తొలగించి రామ కృష్ణ తన చెల్లిలి కాపురం ఏవిదంగా నిలబెట్టాడు అన్నది మిగిలిన కధ.
విశ్లేషణ:
అన్నా చెల్లెళ్ళ అనురాగం, వీరత్వం ఉన్న హీరో, రాయలసీమ ఫ్యాక్షన్ అనే అంశాలతో ముడేసుకున్న కధ కళ్యాణ్ రామ్ కత్తి. కధ ఎప్పటిలానే హిట్ ఫార్ములాతో తయారైన కధనం మాత్రం అతుకుల బొంతలా ఉంది. మాస్ సినిమా అంటే నాలుగు ఫైట్ లు, పంచ్ డైలాగులు మసాల ఉండాలి అని లేక్కలేసుకుని, కొలతలతో తీసినట్టు ఉంటుంది సినిమా. దర్శకుడిగా మల్లికార్జున్ కు యన్. టి.ఆర్ ఆర్ట్స్ రూపంలో కావలసిన వనరులు అందుబాటులో ఉన్నా సరిగ్గా ఉపయోగించుకున్నట్టు అనిపించదు. అన్ని డిపార్టమెంట్లు వాటి వంతు బెస్ట్ అవి ఇచ్చిన వాటిని ఏర్చి కూర్చుకోవటంలో మల్లికార్జున్ ఫెయిల్ అయ్యాడు. దాంతో వారి కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరయింది మల్లికార్జున్ తన మొదటి సినిమా అభిమన్యు లో ఏ తప్పులు చేసాడో అవే కత్తి లో కూడా రిపీట్ కావడం బాధాకరం. కళ్యాణ్ రామ్ నటుడుగా పరవాలేదనిపించిన, మంచి నిర్మాణాత్మక విలువలతో మంచి నిర్మాతగా మాత్రం మంచి మార్కులు కొట్టేసాడు. నాయకి గా పరిచయం అయిన సనాఖాన్ అంత గొప్పగా ఏమి లేదు, ఫైగా ఆమెకు సరైన పాత్రకూడా లేదు. కిక్ తో తెలుగు వారికీ పరిచయం అయిన శ్యాం నటనలో ఇజ్ తో ఆకట్టుకుంటాడు. హీరో చేల్లిలిగా శరణ్య బాగా నటించింది. విలన్ ముత్యం గా అత్తరు చల్లేస్తా అంటూ తనదైన శైలిలో కోట శ్రీనివాసరావు అలరిస్తాడు. ధర్మవరం తన సహజ శైలిలో పాత్రను అల్లుకు పోయాడు. స్వాతి ముత్యం గా బ్రమ్మానందం, హీరోమామగా వేణు మాధవ్, ఆటో బాష గా రఘుబాబు కామెడీ చేయడానికి ప్రయత్నించారు కానీ పెద్ద గా వర్క్ అవుట్ కాలేదు. మాటల రచయిత రత్నం మాటలు బానే ఉన్న అందుకు తగ్గ సన్నివేశాలు లేక సినిమా వెలా తలా బోయింది.
ప్లస్ పాయింట్స్:
మణిశర్మ సంగీతం, బ్యాక్ స్కోరు మ్యూజిక్ ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్స్. సర్వేశ్ మురారి సినిమాటోగ్రఫీ, గౌతమ్ రాజు ఎడిటింగ్ ఈ సినిమాకు అదనపు ఆకర్షణ. టెక్నికల్ గా మంచి విలువలు ఉన్న సినిమా.
మైనస్ పాయింట్స్:
రొటీన్ కధ, బలహీన మైన కధనం ఈ సినిమాకు మొదటి మైనస్ పాయింట్స్. పెద్ద కామెడీ ఆర్టిస్ట్ లు ఉన్న వినోదం సరిపడా లేడు.
కొసమెరుపు:
మొదటి వారం గడిచేప్పటికి పది... పాతిక ... యాబై.... వంద..... లెక్క నీ వోపిక దియేటర్ లో ఎంతమంది ఉంటారో లెక్క చూసుకుంటే సినిమా హిట్టో ఫట్టో తెలిపోద్ది.